సీఎం స్థానంలో మంత్రి అమర్నాధ్ - అరుదైన గౌరవం..!!

Minister Amarnath: మంత్రి గుడివాడ అమర్నాధ్ కు అరుదైన గౌరవం దక్కింది. రాష్ట్రపతి హోదాలో తొలి సారి ద్రౌపదీ ముర్ము విశాఖ వస్తున్నారు. ఈ సమయంలో రాష్ట్ర మంత్రి అమర్నాద్ సీఎం బదులుగా రాష్ట్రపతి కార్య్రమాల్లో ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహించనున్నారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి టూర్ వేళ మంత్రి అమర్నాధ్ హోదాను పెంచుతూ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ గా ఖరారు చేసారు. దీంతో తొలి సారి మంత్రి అయిన అమర్నాధ్ కు ఇది అరుదైన అవకాశంగా మారనుంది.

రాష్ట్రపతి కి సీఎం జగన్ ఆధ్వర్యంలో సన్మానం

రాష్ట్రపతి కి సీఎం జగన్ ఆధ్వర్యంలో సన్మానం


రాష్ట్రపతి ముర్ము రెండు రోజుల ఏపీ పర్యటనకు రానున్నారు. రేపు (ఆదివారం) ఢిల్లీ నుంచి గన్నవరం చేరుకోనున్న రాష్ట్రపతికి విమానాశ్రయంలో గవర్నర్ బిశ్వభూషన్..సీఎం జగన్ స్వాగతం పలకనున్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం సీఎం జగన్ ఆధ్వర్యంలో పౌర సన్మానం ఏర్పాటు చేసింది. ఆ తరువాత రాజ్ భవన్ లో గవర్నర్ రాష్ట్రపతి గౌరవార్దం విందు ఏర్పాటు చేసారు. ఇందులో సీఎం జగన్ తో పాటుగా హైకోర్టు న్యాయమూర్తులు, మంత్రులు హాజరవుతారు. ఆ తరువాత విశాఖ పర్యటనకు రాష్ట్రపతి బయల్దేరుతారు. విశాఖలో జరుగుతున్న నేవీ డే వేడుకల్లో పాల్గొనటంతో పాటుగా అక్కడ ఏపీకి సంబంధించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారు.

మంత్రి అమర్నాధ్ కు బాధ్యతలు

మంత్రి అమర్నాధ్ కు బాధ్యతలు

విశాఖలో రాష్ట్రపతి హోదాలో తొలి సారి వస్తున్న ముర్ముకు మంత్రి అమర్నాధ్ స్వాగతం పలకనున్నారు.ముఖ్యమంత్రి విజయవాడలోనే ఉండిపోనుండటంతో ఆ బాధ్యతలను మంత్రి అమర్నాధ్ కు అప్పగించారు. రాష్ట్రపతి విశాఖలో ఉన్న సమయం మొత్తం మంత్రి అమర్నాద్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధిగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలోనూ మంత్రి పాల్గొంటారు. రాష్ట్ర ప్రభుత్వం మంత్రి అమర్నాధ్ కు ఇందుకు సంబంధించి అధికారికగా మినిస్టర్ ఇన్ వెయిటింగ్ హోదా కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. విశాఖలో కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత రాష్ట్రపతి అక్కడ నుంచి తిరుపతి కి బయల్దేరుతారు.

5న శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి..

5న శ్రీవారిని దర్శించుకోనున్న రాష్ట్రపతి..

ఆదివారం రాత్రి 9.25 గంటలకు రాష్ట్రపతి తిరుపతి చేరుకోనున్నారు. నేరుగా తిరుమల చేరుకొని అక్కడే బస చేస్తారు. ఉదయం 9.25 గంటలకు వరాహ స్వామి, తిరుమల శ్రీవారి దర్శనం చేసుకోనున్నారు. అక్క నుంచి పద్మావతి అతిథి గృహం చేరుకుంటారు. 10.50 గంటలకు తిరుమల నుండి బయలుదేరి 11.35 గంటలకు అలిపిరి గోమందిరంకు రానున్నారు. 11.55 గంటలకు శ్రీ పద్మావతి మహళా విశ్వవిద్యాలయం ను రాష్ట్రపతి సందర్శించనున్నారు. మధ్నాహ్నం 1.00 గంటకు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. అక్కడి నుంచి నేరుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. ఆ వెంటనే 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి డిల్లీ తిరుగు ప్రయాణం ఉండేలా రాష్ట్రపతి అధికారిక షెడ్యూల్ ఖరారైంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+