చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో: ఘాటుగా గుడివాడ అమర్నాథ్
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయ్యి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు స్వల్ప అస్వస్థతకు గురయ్యారని, ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో చంద్రబాబు డీ హైడ్రేషన్ కు గురయ్యారని వార్తలు వచ్చాయి. అయితే డీహైడ్రేషన్ కారణంగా రాజమహేంద్రవరం జైలులో చంద్రబాబు అస్వస్థతకు గురైనట్టు నారా భువనేశ్వరి కుటుంబ సభ్యులకు చంద్రబాబు చెప్పినట్టు వార్తలు వచ్చిన నేపథ్యంలో మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు.
చంద్రబాబు డీహైడ్రేషన్ వార్తలపై ఘాటుగా కౌంటర్ ఇచ్చారు మంత్రి గుడివాడ అమర్నాథ్. చంద్రబాబు అస్వస్థతకు గురైనట్టు చెప్పి సింపతీ కోసం ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబు ఉంటుంది వెల్నెస్ సెంటర్లో కాదు సెంట్రల్ జైల్లో అన్న విషయం గుర్తుపెట్టుకోండి అని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.

నేరం చేసిన వాళ్ళని ఉంచడానికి జైళ్ళు ఉన్నాయని పేర్కొన్న గుడివాడ అమర్నాథ్ డీహైడ్రేషన్ అయినా, దోమలు కుట్టిన జైల్లో అన్ని రకాల సేవలు అందుబాటులో ఉంటాయని కౌంటర్ ఇచ్చారు.ఇక లోకేష్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన గుడివాడ అమర్నాథ్ సిఐడి విచారణ తర్వాత లోకేష్ సెల్ఫ్ సర్టిఫైడ్ మేధావిలా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు.
దొంగతనం చేసిన వాళ్ళు ఒకసారితో నిజం చెప్పరని ఆయన పేర్కొన్నారు. సిఐడి వేసే ప్రశ్నలు అమరావతి భూముల స్కాముల చుట్టూనే ఉంటాయి కానీ, లోకేష్ కుటుంబం యోగక్షేమాల గురించి కాదు అంటూ సెటైర్లు వేశారు. హెరిటేజ్ ను ఏర్పాటు చేయడం కోసం అమరావతిలో 14 ఎకరాలు కొనుగోలు చేయనప్పుడు లోకేష్ ఎందుకు సంతకం పెట్టాడో చెప్పాలని అమర్నాథ్ డిమాండ్ చేశారు.
లోకేష్ ఏదో చెప్పినంత మాత్రాన, మేధావిలా బిల్డప్ ఇచ్చినంత మాత్రాన చేసిన తప్పు నుంచి తప్పించుకోలేరని, లోకేష్ చేసిన తప్పుకు శిక్ష పడటం ఖాయమని గుడివాడ అమర్నాథ్ తెలిపారు. అంతేకాదు విశాఖలో ఐటీ అభివృద్ధి దిశగా వెళుతుందని పేర్కొన్న ఆయన, ఈనెల 16వ తేదీన ఇన్ఫోసిస్ కార్యాలయం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమవుతుందని గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు.
-
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
ఏపీ, తెలంగాణలో రెండు కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ - ఈ ప్రాంతాల్లోనే..!! -
PDS Kerosene: మళ్లీ రేషన్ షాపుల్లో కిరోసిన్-కేంద్రం అత్యవసర ఆదేశాలు..! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట! -
మహిళలకు నెలకు రూ.3వేలు.. అస్సాంలో బీజేపీ మ్యానిఫెస్టో రిలీజ్ -
విజయ్ పార్టీకి త్రిష శాపం? రెండు చోట్ల ఓటమి ఖాయం! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
కొత్త పెన్షన్ల పై ప్రభుత్వం కీలక నిర్ణయం: పంపిణీ ముహూర్తం, మార్గదర్శకాలు..!! -
విజయ్ సేతుపతి 'కాట్టన్' రివ్యూ: ఇదేం స్టోరీ బాబోయ్.. పిచ్చెక్కిస్తోంది..!!












Click it and Unblock the Notifications