కర్నూలు కొండారెడ్డి బురుజుకొస్తావా? తేల్చుకుందాం.. లోకేష్ కు మంత్రి సవాల్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రను కొనసాగిస్తున్నారు. పాదయాత్ర కొనసాగుతున్న కర్నూలు జిల్లాలో లోకేష్ వైసీపీ నేతల అవినీతిపై తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. మంత్రి గుమ్మనూరు జయరాంపై అవినీతి ఆరోపణలు చేసిన లోకేష్ భూ కబ్జాలకు పాల్పడుతున్నారు అంటూ విమర్శలు గుప్పించారు. లోకేష్ చేసిన వ్యాఖ్యలతో మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సవాల్ విసిరారు. కర్నూలు దాటే లోపు తేల్చుకుందాం వస్తావా అంటూ వ్యాఖ్యలు చేశారు. కర్నూలు కొండారెడ్డి బురుజు దగ్గర కబ్జా చేసిన భూములపై చర్చిద్దాం రమ్మంటూ మంత్రి గుమ్మనూరు జయరాం ఛాలెంజ్ విసిరారు. తాను భూకబ్జాలు చేశానని లోకేష్ చెబుతున్నారని తాను కబ్జా చేశానని చెబుతున్న భూములను లోకేష్ కు ఇస్తాను రమ్మన్నారు.

అంతేకాదు మీ హయాంలోనే ఈఎస్ఐ లో అవినీతి జరిగిందని, తాను అవినీతికి పాల్పడినట్లు నిరూపించాలని సవాల్ విసిరిన ఆయన నేను అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని, మరి నువ్వు, నీతండ్రి శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తారా అంటూ మంత్రి గుమ్మనూరు జయరాం మండిపడ్డారు. రెండుఎకరాల నుండి రెండు లక్షల కోట్ల రూపాయలు సంపాదించారని ఆ డబ్బులతో 330ఎకరాలు కొనుగోలు చేసి బీసీలకు రిజిస్ట్రేషన్ చెయ్యాలంటూ ఎద్దేవా చేశారు.

ఈనెల 30వ తేదీ లోపు పది రోజుల్లో లోకేష్ వస్తే తన కుటుంబంపై ఉన్న భూములన్నీ లోకేష్ కు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని, తన భూములతో పాటు లోకేష్ మరో 330 ఎకరాలు కొని బీసీలకు ఇస్తారా అంటూ ప్రశ్నించారు. లోకేష్ .. పాదయాత్ర అయిపోయే లోపు నిర్ణయం తీసుకోవాలంటూ సవాల్ విసిరారు మంత్రి గుమ్మనూరు జయరాం. తాను కొన్న భూములను ఇప్పుడున్న ప్రభుత్వం ధరకే రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని, అలాగే మిగిలిన మూడు వందల ముప్పై ఎకరాల భూములను కొని బీసీలకు పంచాలంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications