పవన్ పూజకు పనికిరాని పువ్వు; జీవితంలో సీఎం కాలేడు: మంత్రి జోగి రమేష్!!
టీడీపీ అధినేత చంద్రబాబుపై, పవన్ కళ్యాణ్ పై ఏపీ మంత్రి జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తాజాగా పొత్తులపై చేసిన వ్యాఖ్యలపై మండిపడిన మంత్రి జోగి రమేష్ పవన్ కళ్యాణ్ జీవితంలో సీఎం కాలేడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు పాలేరు అని, తాను పాలకుడిని కాదు పాలేరునని పవన్ కళ్యాణ్ ఒప్పుకున్నారని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్ ని నమ్ముకుంటే కార్యకర్తలను నట్టేట ముంచారని, ప్రస్తుతం జనసేన కార్యకర్తలు తెగ బాధపడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పదేళ్లుగా పవన్ కళ్యాణ్ కు జెండాలు మోసిన జనసైనికులు, తాజాగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలతో ఆత్మరక్షణలో పడ్డారు అని మంత్రి జోగి రమేష్ వ్యాఖ్యానించారు.

పవన్ తాను ప్యాకేజీ స్టార్ అని మరోమారు నిరూపించుకున్నారని ఆయన అన్నారు. పవన్ పూజకు పనికిరాని పువ్వు లాంటి వ్యక్తిని మంత్రి జోగి రమేష్ ఎద్దేవా చేశారు. జనసైనికులు ఒక్కసారి ఆలోచించి పాలేర్లుగా మారకుండా నిర్ణయం తీసుకోవాలని మంత్రి జోగి రమేష్ సూచించారు. టీడీపీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ జనసేన నేతలు పోటీ చేసేది లేదని, జనసేన నేతల పేరుతో టిడిపి నాయకులే పోటీ చేస్తారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
చంద్రబాబు అవసరాన్నిబట్టి రాజకీయాలు చేస్తారని మండిపడిన మంత్రి జోగి రమేష్ గతంలో చంద్రబాబు మనుషులు పవన్ కళ్యాణ్ కుటుంబాన్ని కూడా బూతులు తిట్టారని గుర్తు చేశారు. పార్టీ పెట్టి 10 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్ ఏమీ సాధించలేక పోయాడని ఇందుకు కారణం చంద్రబాబేనని మంత్రి జోగి రమేష్ అన్నారు.
పవన్ కళ్యాణ్ ను పాలేరును చేసి చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు కుతంత్రాలన్నీ ఇలాగే ఉంటాయని పేర్కొన్న ఆయన పాలకులు ఎవరో .. పాలేరులు ఎవరో.. గుర్తించి వ్యవహరించాలంటూ ప్రజలకు సూచన చేశారు. పవన్ ను నమ్ముకుంటే ఇలాగే ఉంటుందని జనసేన కార్యకర్తలను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు.












Click it and Unblock the Notifications