అలా చేస్తే నామినేషన్ ఉపసంహరించుకుంటా.. సోమిరెడ్డికి మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి నామినేషన్లు పూర్తి కావడంతో ఇక అధికార ప్రతిపక్ష పార్టీల నేతలు ఎన్నికల ప్రచారంలో దూకుడును కొనసాగించనున్నారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు మాటల తూటాలను పేలుస్తూ రాజకీయాలను రసవత్తరంగా మారుస్తున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలో హోరాహోరీగా టిడిపి వర్సెస్ వైసీపీ కొనసాగుతుంది. ముఖ్యంగా కాకాణి గోవర్ధన్ రెడ్డి వర్సెస్ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మధ్య వార్ కొనసాగుతుంది.
సోమిరెడ్డిపై విరుచుకుపడిన కాకాణి గోవర్ధన్ రెడ్డి
నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఎన్నికల్లో పంచేందుకు భారీగా మద్యం కాకాణి గోవర్ధన్ రెడ్డి డంప్ చేయించారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. ఈ క్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి సోమిరెడ్డి పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని ఆయన అసహనం వ్యక్తం చేశారు. జిల్లాలో ఎక్కడ మద్యం దొరికినా వైసిపి దేనని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తనపై బురద చల్లుతున్నాడని ధ్వజమెత్తారు.

సోమిరెడ్డి దిగజారుడు వ్యాఖ్యలు అందుకే
ఓడిపోతానన్న భయంతోనే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ తరహా దుష్ప్రచారానికి దిగారని, నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారని కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఓటమిని ముందుగానే అంగీకరించిన తెలుగుదేశం పార్టీ నాయకులు దిక్కుతోచని స్థితిలో ఈ విధమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, దిగజారి మాట్లాడుతున్నారని విమర్శించారు.
సంస్కారం నేర్చుకో సోమిరెడ్డి
గత ఎన్నికలలో ఎలక్షన్ కమిషనర్ చేసిన ఎఫ్ఐఆర్లో నా పేరు ఉందని చెబుతున్నారని, సోమిరెడ్డి నిరూపిస్తావా.. అంటూ ప్రశ్నించారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి. మద్యం దొరికిన రైస్ మిల్ ఓనర్ కి తనకు సంబంధం ఉందని నిరూపిస్తావా అంటూ ప్రశ్నించారు. బురద జల్లే పనులు మానుకోవాలని హితవు పలికారు. సోమిరెడ్డి సంస్కారంగా బతకడం నేర్చుకోవాలని సూచించారు. ఎక్కడో మద్యం దొరికితే దాన్ని తనకు ఆపాదిస్తున్నారు అని అసహనం వ్యక్తం చేశారు.
అలా చెయ్ .. నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా: కాకాణి
పొదలకూరులో జరిగిన చంద్రబాబు సభకు 5000 మంది వచ్చారని నిరూపిస్తే కాకాణి గోవర్ధన్ రెడ్డి సవాల్ విసిరారు. నిరూపిస్తే నా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటానన్నారు. సోమిరెడ్డి బ్రతుకంతా అవినీతి మయమని, ఓటర్లకు డబ్బులు పంచుతున్న సోమిరెడ్డి ని డిస్ క్వాలిఫై చేయాలని తాను సీఈసీ కి కూడా ఫిర్యాదు చేశానన్నారు. ఇక ఎన్నికల్లో తాను ఏమి మాట్లాడాలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిసైడ్ చేస్తున్నారని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications