హోదాపై మాట్లాడే చంద్రబాబుకు సిగ్గుందా? ఆ వీడియోలు చూసే ధైర్యముందా? తూర్పారబట్టిన మంత్రి కన్నబాబు

టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఎదురు దాడి చేశారు.తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డ చంద్రబాబు అఖండ సినిమా చూసిన ప్రస్టేషన్ తో చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టినట్లు ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. చంద్రబాబు చూడాల్సింది అఖండ సినిమా కాదని, జస్టిస్ చంద్రు మాట్లాడిన వీడియో అని పేర్కొన్న కన్నబాబు ఆ వీడియోలు చూసే ధైర్యం చంద్రబాబుకు ఉందా అంటూ ప్రశ్నించారు.

అఖండ సినిమాపై చంద్రబాబు రియాక్షన్.. ఏపీ పరిస్థితులకు లింక్ పెట్టి అనూహ్య వ్యాఖ్యలు

 హోదాపై మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుందా?

హోదాపై మాట్లాడటానికి చంద్రబాబుకు సిగ్గుందా?

తెలుగుదేశం పార్టీ స్కిల్ తో స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లో చేసిన స్కామ్ ను బయట పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపై ఉందని పేర్కొన్న మంత్రి కన్నబాబు, చంద్రబాబు తమ ఐదేళ్ల కాలంలో స్ట్రా వేసి మరీ ఎంత లూటీ చేశారో బయటకు వస్తుందని పేర్కొన్నారు. ఇక చంద్రబాబు ప్రత్యేక హోదా గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాడని, అసలు విభజన హామీలు ఏమయ్యాయని మాట్లాడడానికి చంద్రబాబుకు సిగ్గు ఉందా అంటూ ప్రశ్నించారు. ప్యాకేజీ చాలు హోదా వద్దు అని సంబరాలు చేసుకుంది చంద్రబాబు కాదా అని మంత్రి కన్నబాబు మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసినప్పుడు, టీడీపీ ఎంపీలు ఎందుకు రాజీనామా చేయలేదో చెప్పాలని మంత్రి కన్నబాబు చంద్రబాబును నిలదీశారు.

అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ భజన.. ఇప్పుడు విభజనా?

అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ భజన.. ఇప్పుడు విభజనా?

జగన్ ను గద్దె దించడమే లక్ష్యంగా దుష్ప్రచారం చేస్తున్నారని కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీలు రాజీనామా చేయాలని అడుగుతున్న చంద్రబాబుకు, గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్ వైసీపీ ఎంపీలతో రాజీనామా చేయించిన ఘటన ఎందుకు గుర్తు లేదని ప్రశ్నించారు. 30 వేల ఎకరాల ఆస్తి కోసం అమరావతి పేరుతో ఉద్యమం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అమరావతి కోసం ఊరేగింపులు, బంద్ లు తన బినామీ ఆస్తుల విలువ పెంచుకోవడానికి చంద్రబాబు చేయిస్తున్నారంటూ మంత్రి కన్నబాబు ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ భజన చేశారని ప్రతిపక్షంలో ఉంటే రాష్ట్ర విభజన అంటున్నారని కన్నబాబు మండిపడ్డారు.

 చంద్రబాబు ప్యాకేజ్ ఒప్పుకున్న నాడే ప్రత్యేక హోదా కనుమరుగైంది

చంద్రబాబు ప్యాకేజ్ ఒప్పుకున్న నాడే ప్రత్యేక హోదా కనుమరుగైంది

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్యాకేజీ ఇచ్చినందుకు అసెంబ్లీలో ధన్యవాదాల తీర్మానం చేసిన విషయాన్ని మరిచిపోయారా అంటూ చంద్రబాబుపై కన్నబాబు విరుచుకుపడ్డారు. అప్పుడు చంద్రబాబు తీర్మానాలు చేసి ఇప్పుడు సుభాషితాలు ప్రవచనాలు చెప్తారా అంటూ కన్నబాబు మండిపడ్డారు. చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీ ఒప్పుకున్న నాడే ప్రత్యేక హోదా కనుమరుగయ్యిందని కన్నబాబు పేర్కొన్నారు. ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ విక్రయం గురించి గురించి మాట్లాడుతున్న చంద్రబాబు ఆయన సీఎంగా ఉన్నప్పుడే గోదావరి ఎరువుల ప్లాంట్ అమ్మేశారని అప్పుడు ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టు ను వైయస్ ప్రారంభిస్తే ఆయన కుమారుడు జగన్ దాన్ని పూర్తి చేస్తారని, ఒక లక్షా 30 వేల మందికి ఉద్యోగాలు ఇస్తే నిరుద్యోగం ప్రబలిపోయిందని చంద్రబాబు మాట్లాడటం హాస్యాస్పదమని ఇప్పటితో పోలిస్తే టిడిపి హయాంలో ఐదు శాతం ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని కన్నబాబు పేర్కొన్నారు.

పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షకు బదులు మోడీపై ఒత్తిడి తెస్తే మంచిది

పవన్ కళ్యాణ్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం దీక్షకు బదులు మోడీపై ఒత్తిడి తెస్తే మంచిది

రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే అవకాశం ప్రజలు ఇచ్చినా చంద్రబాబు దుర్వినియోగం చేశారని కన్నబాబు మండిపడ్డారు. ఇక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తున్న అంశంపై మాట్లాడిన కన్నబాబు పవన్ కళ్యాణ్ దీక్ష చేస్తే మంచిదే, కానీ పవన్ కళ్యాణ్ మోదీ వద్దకు వెళ్లి ఒత్తిడి చేస్తే ఇంకా మంచిది అంటూ కన్నబాబు అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ను విక్రయించకూడదనే చెబుతున్నట్టు కన్నబాబు పేర్కొన్నారు. తాజాగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఒక్కొక్కటిగా పేర్కొని, తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన కన్నబాబు రివర్స్ ఎటాక్ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+