వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాజధానిపై బోత్స వాఖ్యల్లో తప్పులేదు.. మంత్రి కోడాలి నాని

|
Google Oneindia TeluguNews

ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజధానిపై మంత్రి బోత్స చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపుతుండంతో వాటికి మరింత అజ్యం పోశారు మంత్రి కొడాలి నాని. రాజధానిపై పార్టీలో జరుగుతున్న చర్చనే బోత్స సత్యనారయణ వెల్లడించాడని, ఈ నేపథ్యంలోనే ఆయన చేసిన వ్యాఖ్యల్లో తప్పు లేదని స్పష్టం చేశారు. రాజధానిలో జరిగిన అవినీతి అక్రమాల్లో చర్చ జరగాలన్నదే తన అభిప్రాయామని ఆయన తెలిపారు. అంతేకాని రాజధానిని తరలిస్తామని వైసీపీ ఎప్పుడు చెప్పలేదని అన్నారు.

Minister Kodali Nani supports Bosta saytyanarayana comments on amaravathi

ఈ నేపథ్యంలోనే రాజధాని పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నేతలు కోట్ల రుపాయాలు ప్రజల నుండి దోచుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. అయితే రాజధాని పేరుతో గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాను బయటపెడతామనే భయంతో ప్రతిపక్ష టీడీపీ నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని విమర్శంచారు.ఈ సంధర్భంలోనే రాజధానిని మార్చే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన నానీ ఒకవేళ ప్రభుత్వం మార్చాలని భావిస్తే ప్రతిపక్ష టీడీపీ నేతలు అపగలవా అని సవాల్ విసిరారు. దీంతో పాటు గత ప్రభుత్వంలో జరిగిన అక్రమాలపై మంత్రి వర్గ ఉపసంఘం విచారణ చేపట్టిందని వారి నివేదిక అందిన వెంటనే ప్రభుత్వం అక్రమాలు, అవినీతీ చేసిన వారిపై చర్యలు తీసుకుంటుందని అన్నారు.

మరోవైపు పోలవరం ప్రాజెక్టు రీటెండరింగ్ పై హైకోర్టు స్టే ఇవ్వడం తాత్కలికమే అని వ్యాఖ్యానించారు. అవినీతీ అక్రమాలు తగ్గించి ప్రభుత్వ ధనాన్ని సద్వినియోగం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఇందుకోసం ఎన్ని అడ్డంకులు వచ్చిన సీఎం జగన్ ఎదుర్కోంటారని అన్నారు. కాగా రివర్స్ టెండరింగ్ నిర్ణయంపై హైకోర్టు ఎక్కడా తప్పు పట్టలేదని చెప్పారు. రీ టెండరింగ్ అంశంలో ముఖ్యమంతి జగన్ ప్రయత్నాలు ముందుకే కాని వెనకడు వేయడని స్పష్టం చేశారు.

English summary
Minister Kodali Nani has once again made dispute comments on capital of ap.and he supported minister bosta satyanarayan comments which made on amaravathi yesterday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X