మల్లవల్లిలో అశోక్ లేలాండ్ ప్లాంట్ ప్రారంభం, భారీగా ఉద్యోగావకాశాలు
కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలో అశోక్ లేలాండ్ ప్లాంట్(బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్)ను ఏపీ మంత్రి నారా లోకేశ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు టీజీ భరత్, కొల్లు రవీంద్ర, గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, అశోక్ లేలాండ్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.
అమరావతిలో ప్రారంభమైన తొలి ఆటోమొబైల్ ప్లాంట్‌గా అశోక్ లేలాండ్ నిలిచింది. మల్లవల్లి పారిశ్రామికవాడలోని 75 ఎకరాల్లో ఈ ప్లాంట్ విస్తరించి ఉంది. ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్, డీజిల్ బస్సుల బాడీ బిల్డింగ్ యూనిట్ ఏర్పాటు చేసింది హిందూజా గ్రూప్. ఈ ప్లాంట్ ఏడాదికి 2400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యం కలిగి ఉంది. ఈ యూనిట్ ద్వారా ఫేజ్-1లో 600 మందికి ఉపాధి లభిస్తోంది. ఇక, ఫేజ్-2లో 1200 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.

హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేలాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో నాలుగో స్థానం ఉంది. కాగా, మల్లవల్లి ఇండస్ట్రియల్ పార్క్‌లో అశోక్ లేలాండ్ ప్లాంట్ ను ప్రారంభించడానికి ముందు హనుమాన్ జంక్షన్ అభయాంజనేయస్వామి ఆలయంలో మంత్రి లోకేష్ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మంత్రి లోకేశ్‌కు ఆశీర్వచనాలు అంజేశారు.
*మల్లవల్లిలో ''అశోక్ లేలాండ్ ప్లాంట్''ను ప్రారంభించి, డబుల్‌డెక్కర్ బస్సు ఎక్కి పరిశీలించిన మంత్రి నారా లోకేష్.*#AshokLeylandInAP
— Madhuri Royal B+ (@royal_madhuri) March 19, 2025
#AndhraPradesh pic.twitter.com/P6MZkvURHT
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధి సమీక్ష
మంగళగిరి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయం అభివృద్ధికి సంబంధించి అధికారులు రూపొందించిన మాస్టర్ ప్లాన్ పై ఉండవల్లి నివాసంలో సమీక్షించారు మంత్రి లోకేశ్. ప్రముఖ దేవాలయాల తరహాలో శ్రీలక్ష్మీ నరసింహస్వామి దేవాలయాన్ని అభివృద్ధి చేస్తామన్నారు.
రహదారుల నిర్మాణం, వసతి, ఇతర సదుపాయాలు, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులకు ఈ సందర్భంగా పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో భక్తులు స్వామివారిని దర్శించుకోవాలని, అందుకు అనుగుణంగా మాస్టర్ ప్లాన్ ను తీర్చిదిద్దాలని ఆదేశించారు. ఇందుకు ఆలయ పండితులతో పాటు నిపుణుల సలహాలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మంగళగిరిలో అభివృద్ధి పనులపై సమీక్ష
మంగళగిరిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్టుల డీపీఆర్ లపై అధికారులతో ఉండవల్లి నివాసంలో మంత్రి లోకేశ్ సమీక్షించారు. పలు సూచనలు చేశారు. ఎంటీఎంసీ పరిధిలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అండర్ గ్రౌండ్ డ్రేనేజీ, డ్రింకింగ్ వాటర్, స్టార్మ్ వాటర్(వర్షపు నీటి నిర్వహణ) ప్రాజెక్టులకు సంబంధించి మే నెలలో పనులు ప్రారంభించి ఏడాదిన్నరలోగా పూర్తిచేసేలా ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ఆయా ప్రాజెక్టుల డీపీఆర్ లను పకడ్బందీగా రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
భారతదేశంలోని ఆటోమొబైల్ రంగంలో రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థగా పేరుపొందిన ''అశోక్ లేలాండ్ ప్లాంట్ ను మల్లవల్లిలో ప్రారంభించిన మంత్రి నారా లోకేష్.#AshokLeylandInAP #NaraLokesh #AndhraPradesh pic.twitter.com/ZzIHOENvrB
— Telugu Desam Party (@JaiTDP) March 19, 2025
చినకాకాని ఆస్పత్రి విస్తరణకు ఆదేశాలు
మంగళగిరి సమీపం చినకాకాని వద్ద వంద పడకల ఆసుపత్రి నిర్మాణంపై ఆసుపత్రి సాధన కమిటీ సభ్యులు, అధికారులతో ఉండవల్లి నివాసంలో సమీక్ష నిర్వహించారు మంత్రి నారా లోకేశ్. వందపడకల ఆసుపత్రిని భవిష్యత్తులో జి ప్లస్3 కి విస్తరించేలా నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. డాక్టర్లు, నర్సులు, పేషెంట్ల బంధువులు, రోగులకు వేర్వేరు నడకదారులు ఉండేవిధంగా డిజైన్‌లో మార్పులు చేయాలని సూచించారు. ఆసుపత్రిలో ప్రత్యేకంగా డి అడిక్షన్ సెంటర్‌ను కూడా ఏర్పాటుచేయాలని ఆదేశించారు. సాధన కమిటీ సూచనల మేరకు డిజైన్‌లో పలు మార్పులు, చేర్పులు చేయడం జరిగిందన్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
పాకిస్తాన్ క్రికెట్ కు ఓ దండం..మెయిన్ విలన్ ఆయనే: కిర్‌స్టెన్ -
"ధురంధర్" డైరెక్టర్ నెక్స్ట్ సినిమా ఆ స్టార్ హీరోతోనే ??? -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
డైరెక్ట్ గా ఇరాన్ నుంచే భారత్ ఆయిల్ కొనుగోళ్లు: గ్యాస్ కొరతకూ చెక్












Click it and Unblock the Notifications