ఏపీలో మరో సంచలనం..ప్రతిస్టూడెంట్‌కి ఐడి కోడ్
పాఠశాల విద్యలో దేశంలోనే అత్యుత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఏపీ మోడల్ రూపకల్పనకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఉండవల్లి నివాసంలో పాఠశాల విద్య ఉన్నతాధికారులతో మంత్రి లోకేష్ సమీక్షించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... కేవలం పాఠ్యాంశాల్లో మాత్రమేకాకుండా స్పోర్ట్స్, కల్చరల్ ఈవెంట్స్ లో కూడా విద్యార్థులను ప్రోత్సహించాలని అన్నారు. పాఠశాలల్లో విద్యాప్రమాణాల మెరుగుదలకు తల్లిదండ్రులు, స్కూల్ కమిటీల భాగస్వామ్యంతో మోడల్ పేరెంట్ టీచర్స్ సమావేశాలు నిర్వహించాలని అన్నారు.
కేజీబీవీ స్కూల్లో టీచింగ్ పోస్టుల భర్తీని పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని, నూరుశాతం ఎకడమిక్ ప్రతిభ ఆధారంగా టీచర్లను ఎంపికచేయాలని ఆదేశించారు. ప్రతి తరగతికి కనీసం ఒక టీచర్ ఉండేలా టీచర్లను సర్దుబాటు చేయాలని సూచించారు. అతిత్వరలో స్కూల్ ఎక్రిడేషన్ ఫ్రేమ్ వర్క్ సిద్ధం చేయాలని, ఇందులో భాగంగా ప్రభుత్వస్కూళ్లలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టిసారించాలని కోరారు. ప్రతిస్టూడెంట్‌కి ఒక యూనిక్ ఐడి కోడ్ ఇవ్వాలని, దీని ద్వారా విద్యార్థులకు అకడమిక్ ట్రాక్ రికార్డును అధ్యయనం చేసి వారికి నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సెప్టెంబర్ 5న గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా వందమందికి పైగా ఉత్తమ ఉపాధ్యాయులను సత్కరించాలని నిర్ణయించారు.

ఉపాధ్యాయుల ఎంపిక పూర్తి పారదర్శకంగా ఉండాలని స్పష్టంచేశారు. విద్యార్థులకు పంపిణీ చేసే ఆక్స్ ఫర్డ్ డిక్షనరీల్లో గతంలో దొర్లిన తప్పులపై సమీక్షించి సరిచేయాలని సూచించారు. ఎక్స్ పీరియన్స్ లెర్నింగ్‌లో భాగంగా పాఠశాలల్లో సైన్స్ ల్యాబ్ ఎక్విప్ మెంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని అన్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న 6 మైనర్ మీడియం విద్యార్థులకు ఇంగ్లీషు మీడియంతోపాటు వారి మాతృభాష పై కూడా పట్టు సాధించేలా పాఠ్యాంశాల రూపకల్పనకు చర్యలు చేపట్టాలని మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి కోన శశిధర్, డైరక్టర్ విజయరామరాజు, ఇంటర్మీడియట్ విద్య డైరక్టర్ కృతికా శుక్లా, రాష్ట్ర సర్వశిక్ష అభియాన్ ప్రాజెక్టు డైరక్టర్ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications