గొప్ప మనసు చాటుకున్న నారా లోకేష్

Nara Lokesh: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్.. తన ఉదారతను మరోసారి చాటుకున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి.. ఉన్నత చదువులు చదువుకోడానికి అవసరమైన ఆర్థిక సహాయం చేస్తానని ప్రకటించారు.

జీవనోపాధి కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి.. అక్కడ చిక్కుకున్న ఇద్దరు తెలుగువారిని స్వదేశానికి తీసుకుని రావడానికి తనవంతు సహాయ సహకారాలను అందజేశారు నారా లోకేష్. అన్నమయ్య రాయచోటి జిల్లా వాయల్పాడుకు చెందిన శివను స్వదేశానికి క్షేమంగా రప్పించడంలో నారా లోకేశ్ సఫలం అయ్యారు. దీనికోసం కువైట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరిపారు.

Minister Nara Lokesh given assurance to a student who got seat in IIIT Lucknow

ఇప్పుడు తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా తణుకు అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని అత్తిలికి చెందిన చేబ్రోలు కాశీ నాగ బసవయ్య అనే విద్యార్థికి లక్నోలోని ఐఐఐటీలో ఎంఎస్‌సీ చేయడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందజేయడానికి ముందుకొచ్చారు మంత్రి నారా లోకేష్.

ఇటీవలే జాయింట్ అడ్మిషన్ టెస్ట్ ఫర్ మాస్టర్స్ పరీక్షలను రాశారు నాగ బసవయ్య. 930వ ర్యాంక్ సాధించారు. దీనితో ఆయనకు లక్నోలోని త్రిపుల్ ఐటీలో డేటా సైన్స్ కోర్సులో ఎంఎస్‌సీ చదవడానికి సీటు లభించింది. డేటా సైన్స్ కోర్సు ఫీజు నాలుగు లక్షల రూపాయలు.

అంత మొత్తాన్ని చెల్లించే చదివే ఆర్థిక స్థోమత నాగ బసవయ్యకు లేకపోవడంతో నారా లోకేష్‌ సహాయాన్ని కోరారు. తన వివరాలను వెల్లడిస్తే నారా లోకేష్‌కు ట్వీట్‌ చేశారు. జేఏఎం స్కోర్ కార్డ్‌ను కూడా దీనికి జత చేశారు. తన ఆర్థిక పరిస్థిితిని ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై నారా లోకేష్ సానుకూలంగా స్పందించారు. ఐఐఐటీ లక్నోలో ఉన్నత చదువులు అభ్యసించాలని ఆకాంక్షించారు. కలను సాకారం చేసుకోవాలని సూచించారు. నాలుగు లక్షల రూపాయల కోర్సు ఫీజు విషయాన్ని తాను చూసుకుంటానని హామీ ఇచ్చారు. బసవయ్యకు ఆల్ ది బెస్ట్ చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+