ఆ ఎమ్మెల్యేలపై లోకేష్ సీరియస్..! సీనియర్లకు కీలక బాధ్యత..!

ఏపీలో గతేడాది ఎన్నికల్లో ఘన విజయం తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తోంది. ఈ కాలంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం విషయంలో దూసుకెళ్తున్నా.. దాన్ని క్షేత్రస్దాయికి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు విఫలమవుతున్నారు. దీనికి తోడు క్షేత్రస్ధాయిలో తొలిసారి గెలిచిన ఎమ్మెల్యేలు కొత్త కొత్త సమస్యలు తీసుకొస్తున్నారు. వీటిని పరిష్కరించడం ఒక్కోసారి సీఎం చంద్రబాబుకే తలకు మించిన భారమవుతోంది. ఈ నేపథ్యంలో కొందరు ఎమ్మెల్యేల తీరుపై మంత్రి నారా లోకేష్ ఇవాళ ఫైర్ అయ్యారు.

ఇవాళ ఉండవల్లిలోని క్యాంపు కార్యాలయంలో పలువురు మంత్రులను పిలిపించుకుని మాట్లాడిన నారా లోకేష్.. తొలిసారి గెలిచిన పలువురు ఎమ్మెల్యేలపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారికి అవగాహన ఉండటం లేదని, అనుభవ లేమితో ఉన్నారని, దీంతో ఇతరులతో సమన్వయం ఉండటం లేదని లోకేష్ వ్యాఖ్యానించారు. తాజాగా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ తో పాటు మరికొందరు తొలిసారి గెలిచిన వారితో తలెత్తిన వివాదాల నేపథ్యంలో లోకేష్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

Minister Nara Lokesh Slams First-Time MLAs as Unaware Inexperienced

ఇవాళ మంత్రులతో భేటీలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు, వివాదాల్లో చిక్కుకుంటున్న వారిపై లోకేష్ చర్చించారు. వారిని గాడిన పెట్టే బాధ్యతను సీనియర్ మంత్రులకు లోకేష్ అప్పగించారు. ఆయా ఎమ్మెల్యేలకు తమ అనుభవాలు చెప్పాలని మంత్రులకు లోకేష్ సూచించారు. ముఖ్యంగా తాము తొలిసారి ఎమ్మెల్యేలు అయినప్పుడు ఎదురైన పరిస్ధితులు, అనుభవాలను వారికి వివరించాలని సూచించారు. లోపాల్ని సరిదిద్దుకోకపోతే మళ్లీ మళ్లీ గెలవడం సాధ్యం కాదని వారికి చెప్పాలని సూచించారు.

Minister Nara Lokesh Slams First-Time MLAs as Unaware Inexperienced

ఈ నెల 14, 15 తేదీల్లో విశాఖలో పెట్టుబడుల ఆకర్షణకు భాగస్వామ్య సదస్సు నిర్వహిస్తున్న నేపథ్యంలో వివాదాలకు దూరంగా ఉంటూ దీన్ని విజయవంతం చేసేందుకు అంతా కలిసికట్టుగా పనిచేయాలని లోకేష్ సూచించారు. ఈ సదస్సు విజయవంతమైతే రాష్ట్రానికి 10 లక్షల కోట్ల పెట్టుబడుల, భారీగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. కాబట్టి ప్రతీ మంత్రీ తమ శాఖల పరిధిలో ఒప్పందాల విషయంలో బాధ్యతగా వ్యవహరించాలని లోకేష్ వారికి సూచించారు. అలాగే తమ జిల్లాల పరిధిలో పెట్టుబడులు పెట్టిన సంస్థలు స్థాపించేలా మంత్రులు, ఇన్ ఛార్జ్ మంత్రులు బాధ్యత తీసుకోవాలన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+