జీవో 30 వల్ల కాపులకు రిజర్వేషన్లు రావు: అందుకే కమిషన్ వేశామన్న నారాయణ
విజయవాడ: కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ఇచ్చిన జీవో 30 వల్ల ఎటువంటి రిజర్వేషన్లు రావని ఏపీ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాపులకు న్యాయం చేసేందుకు చంద్రబాబు నాయుడు మంజునాథ కమిషన్ వేశారని అన్నారు.
కాపుల రిజర్వేషన్‌కు సంబంధించిన సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్లు అనే అంశం చాలా సున్నితమైనది కాబట్టి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటూ పోతున్నారని అన్నారు.
కాపులకు రిజర్వేషన్లు అనే అంశం ఈరోజు సమస్య కాదని, ఎప్పటి నుంచో ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం చంద్రబాబు కమిషన్ వేశారన్నారు. జస్టిస్ మంజునాథ నేతృత్వంలోని కమిషన్ తొమ్మిది నెలల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు.

గతంలో కమిషన్ లేకుండా ఇష్టం వచ్చినట్టు జీవో ఇవ్వడం వల్ల కాపుల రిజర్వేషన్లు వెనక్కిపోయాయన్నారు. ఇటీవల కొంత మంది కాపు నేతలు ముఖ్యమంత్రిని కలిసినప్పుడు, తమకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారని ఆయన తెలిపారు.
మంజునాథ కమిషన్ కూడా తనకు కావాల్సిన సిబ్బంది, మౌళిక సదుపాయాలను కల్పిస్తే సాధ్యమైనంత త్వరలోనే నివేదికను అందిస్తామని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
మంజునాథ కమిషన్ విజయనాడ కేంద్రంగానే పనిచేస్తోందని తెలిపారు. 9 నెలల్లో నివేదిక సాధ్యమేనా అన్న ప్రశ్నకు గాను మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి పూర్తి మద్దుతు లభిస్తే సాధ్యమేనన్నారు. కాపులకు రిజర్వేషన్లు అంశంపై విధివిధానాలను ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు మూడు రోజుల్లో అధికారులతో చర్చిస్తారని అన్నారు.
ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షపై స్పందించిన మంత్రి నారాయణ దీక్ష ఎందుకు చేస్తున్నారో ప్రజలు వివరించాలని అన్నారు. జీవో ద్వారా కాపులకు రిజర్వేషన్లు రావని, కేవలం కమిషన్ ద్వారా మాత్రమే రిజర్వేషన్లు వస్తాయని ముద్రగడకు తెలిసినా దీక్ష చేస్తున్నారని మండిపడ్డారు.
ముద్రగడ ఆమరణ నిరాహార దీక్షపై పునరాలించుకోవాలని కోరారు. గతంలో ఇచ్చిన జీవోలను సుప్రీం కోర్టు, హైకోర్టు కొట్టివేయకున్నా కమిషన్ లేకుండా రిజర్వేషన్లు ఇవ్వడం కుదరని కోర్టులు తేల్చిచెప్పాయని అన్నారు. నాకు తెలిసిన లాయర్లను కొంత మందిని కలిశానని నారాయణ చెప్పారు. కావాలంటే సుప్రీం కోర్టు, హైకోర్టు జడ్జిమెంట్‌ను ముద్రగడ చదవాలని సూచించారు.
ఇదిలా ఉంటే శుక్రవారం నుంచి తన భార్యతో కలిసి ముద్రగడ పద్మనాభం ప్రారభించనున్న ఆమరణ నిరాహార దీక్షకు ఆలిండియా కాపు సంఘం జేఏసీ మద్దతు పలికింది. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేసింది.
-
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఎట్టకేలకు జీవన్ రెడ్డి చేరే పార్టీ ఖరారు, అదే బాటలో..!!












Click it and Unblock the Notifications