బాంబు పేల్చిన మంత్రి, బుడమేరు ఆపరేషన్ టార్గెట్ ఎవరు ?, లెక్కతేలుస్తాం
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ వైసీపీలోని కొందరు నాయకులకు ఊహించని షాక్ ఇచ్చారు. విజయవాడ వరదలకు కారణమైన వారిని చట్టపరంగా శిక్షించేందుకు చర్యలు తీసుకుంటామని, అందుకు త్వరలోనే ప్రత్యేక ఆపరేషన్ మొదలౌతుందని మంత్రి నారాయణ అన్నారు. త్వరలోనే ఆపరేషన్ బుడమేరు మొదలౌతుందని, సీఎం చంద్రబాబు నాయుడు ఆదిశగా చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణ చెప్పారు.
బుడమేరు ప్రాంతాలను కబ్జా చేసిన వాళ్లని ఎట్టి పరిస్థితుల్లోను వదిలిపెట్టమని, వాళ్ళు ఎవరైనా సరే వెనుకా ముందు ఆలోచించమని మంత్రి నారాయణ చెప్పారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడిన మంత్రి నారాయణ బుడమేరు అక్రమాలకు సంబంధించి ఓ క్లూ ఇచ్చారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు పంపిణి విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నామని, పారిశుద్ధ్యం విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ అన్నారు.

వరద బాధితులు పూర్తిగా కోలుకునే వరకు ఆహారం, మంచినీరు, నిత్యవసర కిట్లు అందించాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారని మంత్రి నారాయణ వివరించారు. విజయవాడలో ఇప్పటివరకు 77 వేల విద్యుత్ కనెక్షన్లు పునరుద్ధరించామని, త్వరలోనే అన్ని ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అయ్యేలా ప్రభుత్వ అధికారులు, విద్యుత శాఖ సిబ్బంది తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ వివరించారు.
వరద ప్రభావిత ప్రాంతాల్లో మరో రెండు మూడు రోజులు మీరు తాగొద్దని ఆ ప్రాంతంలోని ప్రజలందరికీ మనవి చేశామని, వారికి మంచినీరు అందించే బాధ్యత మా ప్రభుత్వంపై ఉందని, ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణ వివరించారు. విజయవాడకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణమైన బుడమేరు అక్రమాలపై త్వరలో చట్టపరంగా చర్యలు తీసుకున్నందుకు సీఎం చంద్రబాబు నాయుడు సిద్ధం అయ్యారని మంత్రి నారాయణ అన్నారు.
గత వైసీపీ ప్రభుత్వంలో బుడమేరు ప్రాంతాలని ఇష్టం వచ్చినట్లు ఆక్రమించుకోవడం వలనే ఈరోజు విజయవాడకు ఇలాంటి పరిస్థితి ఎదురైందని, తప్పు చేసిన వారిని ఎవరిని వదిలిపెట్టమని మంత్రి నారాయణ వివరించారు. గత వైసీపీ ప్రభుత్వంలో జగన్ అండతో చాలా మంది వైసీపీ నాయకులు బడమేరును ఆక్రమించి ఆ భూమిని అమాయకులకు విక్రయించారని ఆరోపణలు ఉన్న విషయం తెలిసిందే.












Click it and Unblock the Notifications