జగన్ ఆ విషయంలో నెంబర్ వన్, నేను ఒప్పుకుంటా, టీడీపీ మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇకనైనా ఆయన వైఖరి మార్చుకోకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సింగిల్ డిజిట్ కే పరిమితం అవుతుందని, అందులో ఎలాంటి అనుమానం లేదని ఆంధ్రప్రదేశ్ జన వనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో కలిసి నిమ్మల రామానాయుడు ఢిల్లీ వెళ్లారు.
శనివారం ఢిల్లీలో నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు. ఈసందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ మాజీ సీఎం జగన్ ఒక అపద్దాన్ని పదేపదే మాట్లాడి దాన్ని నిజం చేయాలని ప్రయత్నిస్తున్నాడని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఒక పదాన్ని పదేపదే మాట్లాడి దాన్ని ప్రజల ముందు నిజం చెయ్యడానికి జగన్ అనేక ప్రయత్నాలు చేస్తున్నాడని, అలా చెయ్యాలని జగన్ ఆశ పడతాడని నిమ్మల రామానాయుడు ఆరోపించారు.

పద్దాలు చెప్పడం జగన్ కు వెన్నతో పెట్టిన విద్య అని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. పోలవరం డయాఫ్రం వాల్ పై నివేదిక రాకముందే వైసీపీ నాయకులు లేనిపోని అబద్ధాలు చెబుతున్నారని నిమ్మల రామానాయుడు ఆరోపించారు. వైసీపీ అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలలో కూడా పోలవరం డయాఫ్రం వాల్ పై లేనిపోని మాయమాటలు చెప్పారని, ప్రజలను ఇలాగే మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు.
వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు పక్క దారి మళ్లించి ఆ నిధులు దుర్వినియోగం చేశారని, పోలవరం ప్రాజెక్టు పనుల గాలికి వదిలేసి సర్వనాశనం చేశారని, అధికారం పోయిన తర్వాత ఇప్పుడు వైసీపీ నాయకులు నీతులు మాట్లాడుతున్నారని ఆంధ్రప్రదేశ్ జన వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైనారరి, ఇప్పటికీ జగన్ అతని వైఖరి మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సింగల్ డిజిట్ కే పరిమితమైపోతాడని, ఆ తర్వాత జగన్ని, ఆ పార్టీ నాయకులను ఆ దేవుడు కూడా కాపాడలేడని ఆంధ్రప్రదేశ్ మంత్రి నిమ్మల రామానాయుడు వ్యంగంగా అన్నారు.












Click it and Unblock the Notifications