బనకచర్లపై గోదావరి నీళ్ళతో.. తెలంగాణా ఆరోపణలను కడిగిపారేసిన మంత్రి నిమ్మల
ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల మధ్య బనకచర్ల ప్రాజెక్టుపైన జరుగుతున్న రగడ తెలిసిందే. ఇక దీనిపైన తాజాగా ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పందించారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వాస్తవాలు ప్రజలకు తెలియాలని దీనిపై అసత్యాల ప్రచారం జరుగుతుందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. గత 50 సంవత్సరాలుగా గోదావరి నీరు వృధాగా 3000 టీఎంసీలు సముద్రంలో కలిసిపోతుందనన్నారు.
బనకచర్ల ప్రాజెక్ట్ విషయంలో మంత్రి నిమ్మల క్లారిటీ
కేవలం వృధాపోయే గోదావరి నీటిలో 200టీఎంసీల నీటిని బనకచర్ల కు తరలించాలని ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టామని ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలను వెల్లడించారు. పోలవరం నుంచి ప్రకాశంబ్యారేజీ వరకు, ప్రకాశంబ్యారేజీ నుంచి బొల్లాపల్లి రిజర్వాయర్ వరకు, బొల్లాపల్లి నుంచి బనకచర్ల వరకు మూడు సెగ్మెంట్లుగా బనకచర్ల నిర్మాణం జరుగుతుందని మంత్రి తెలిపారు.

రాజకీయం కోసమే బనకచర్లపై ఆరోపణలు
బనకచర్లపై వస్తున్న ఆరోపణలు కేవలం రాజకీయాల కోసమేనని, తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత రాజకీయాల కోసం చేస్తున్న ఆరోపణలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టుపై సాంకేతిక అంశాల కన్నా, మిగతా అంశాలపైనే ప్రధానంగా మాట్లాడుతున్నారన్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ ప్రభుత్వం ముందుకు వెళుతుందని అసత్యాలు చెబుతున్నారని, అన్ని నియమ నిబంధనల ప్రకారమే, అనుమతి తీసుకున్న తర్వాతనే ఏపీ ప్రభుత్వం నిర్మాణం చేస్తోందని ఆయన పేర్కొన్నారు.
పోలవరం, బనకచర్ల నిర్మాణం నిబంధనల మేరకే జరుగుతున్నాయి
సిడబ్ల్యూసికి ఇప్పటికే ఈ మేరకు ప్రాథమిక నివేదిక ఇచ్చామని తెలిపారు. నివేదికకు తర్వాత dpr ఇస్తామని మంత్రి పేర్కొన్నారు. పోలవరం, బనకచర్ల అనుమతులు నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరద జలాలను ఉపయోగించుకునే హక్కు ఉందని ఎగువ రాష్ట్రాల ప్రయోజనాలు నీటి అవసరాలు తీరిన తర్వాత వస్తున్న వరద జలాలను తాము ఉపయోగించుకుంటున్నాం అని మంత్రి నిమ్మల స్పష్టం చేశారు.
కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్ట్ లకు అనుమతులే లేవు
తాము వరద జలాలు ఉపయోగించుకోవడం వల్ల ఏ రాష్ట్రానికి నష్టం లేదని పేర్కొన్నారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీటిని తాము తమ రాష్ట్రానికి ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నామన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులకు అనుమతులు తీసుకోలేదని మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. పూర్తయిన ప్రాజెక్టులకే అనుమతులకు దిక్కులేదు కానీ, ఇంకా ప్రారంభ దశలో ఉన్న ప్రాజెక్టుల అనుమతుల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు.
తెలంగాణా ప్రాజెక్ట్ లు ఆపాలన్న దురుద్దేశం మాకెప్పుడూ లేదు
తెలంగాణ ప్రాజెక్టులను ఆపాలన్న దురుద్దేశం తమకు లేదని, సీఎం చంద్రబాబుకు అసలే లేదని నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. సీతారాం సాగర్ లిఫ్ట్ కు కూడా మొన్ననే అనుమతి వచ్చిందని, కానీ 75 శాతం పనులు పూర్తయ్యాయని నిమ్మల గుర్తు చేశారు. తెలంగాణలోని చాలా ప్రాజెక్టులకు చంద్రబాబు సహకరించారని గుర్తు చేశారు. దేవాదుల ఎత్తిపోతల పథకంతో పాటు ఎస్సారెస్పీ తదితర ప్రాజెక్టులకు చంద్రబాబు సహకారాన్ని అందించారు అన్నారు.
ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో ఉండాలని చంద్రబాబు చెప్పారు
దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కుల ప్రకారం కొన్ని ప్రాజెక్టుల విషయంలో చంద్రబాబు అభిప్రాయం చెప్పారు తప్ప అడ్డుకోవాలని కాదని తెలిపారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉండాలని చంద్రబాబు చెప్పారని అపెక్స్ లో ఇరు రాష్ట్రాల సీఎంల మాటలు మినిట్స్ రూపంలో ఉన్నాయని గుర్తు చేశారు. మొత్తంగా బనకచర్ల విషయంలో తెలంగాణా దుష్ప్రచారాన్ని మంత్రి నిమ్మల కడిగిపారేశారు.
-
ఇక పెట్రోల్ బంకుల్లోనూ మద్యం.. కొత్త ఎక్సైజ్ పాలసీకి ఆమోదం! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
అల్లు అర్జున్ "పుష్ప - 3"లో స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య.. -
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!!












Click it and Unblock the Notifications