చిత్తూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మంత్రి పెద్దిరెడ్డి వ్యూహాల పట్ల వైఎస్ జగన్ ఫిదా: పిలిపించి మరీ: చిత్తూరు క్రెడిట్ ఆయనకే..!

|
Google Oneindia TeluguNews

అమరావతి: జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తిరుగులేని ఆధిక్యాన్ని ప్రదర్శించింది. 90 శాతానికి పైగా ఓట్లను కొల్లగొట్టింది. ఈ ఎన్నికల ఫలితాలు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీని చావుదెబ్బ కొట్టాయి. అసలు ఎన్నికలను బహిష్కరించిందో.. లేక పోటీ చేసిందో తెలియని అయోమయ స్థితిలోకి నెట్టేశాయి. ఏ రకంగా చూసినా ఈ దారుణ పరాజయాన్ని సమర్థించుకోవడానికి టీడీపీ నాయకులకు మాటలు దొరకట్లేదు.

Vanijya Utsav 2021: విమర్శలకు వైఎస్ జగన్ మార్క్ చెక్: పీఎం మోడీ బొమ్మVanijya Utsav 2021: విమర్శలకు వైఎస్ జగన్ మార్క్ చెక్: పీఎం మోడీ బొమ్మ

 వైసీపీ వైపే..

వైసీపీ వైపే..

జగన్ సర్కార్‌కు జనంలో ఏ మాత్రం ఆదరణ తగ్గలేదనే విషయం మరోసారి నిరూపితమైంది. ఇదివరకు పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లను క్లీన్‌స్వీప్ చేసిన విధంగానే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల్లోనూ వైఎస్సార్సీపీ తిరుగులేని విజయాలను సొంతం చేసుకుంటోంది. అన్ని జిల్లాల్లోనూ వైసీపీ ప్రభంజనం కనిపిస్తోంది. అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్ల తరువాత కూడా ప్రభుత్వ వ్యతిరేక పవనాలు ఏ మాత్రం వీయట్లేదనే విషయాన్ని ఈ ఫలితాలు స్పష్టం చేస్తోన్నాయి.

పార్టీలకు అతీతంగా..

పార్టీలకు అతీతంగా..


కుప్పంలో అధికార పార్టీ పాగా వేయడానికి వైసీపీ ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు కూడా ఓ కారణం అయ్యాయి. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు కూడా పెద్ద ఎత్తున వలంటీర్లుగా నియమితులయ్యారని అంటున్నారు. ఈ వ్యవస్థ ద్వారా ప్రతి టీడీపీ ఓటుబ్యాంకు, ఆ పార్టీ అనుకూల కుటుంబాలు కూడా లబ్ది పొందుతున్నాయి. గ్రామ సచివాలయాల నియామకాల్లో టీడీపీ మద్దతుదారులు కూడా ఉద్యోగాలు పొందడం కలిసి వచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆయా అంశాలన్నీ- వైసీపీ ప్రభుత్వం పార్టీలకు అతీతంగా పరిపాలన సాగిస్తోందనే సందేశాన్ని పంపించినట్టయిందని చెబుతున్నారు.

తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ..

తుడిచి పెట్టుకుపోయిన టీడీపీ..

అన్ని జిల్లాల మాట ఎలా ఉన్నప్పటికీ.. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి సొంత జిల్లా, సొంత నియోజకవర్గం, సొంత గ్రామంలో కూడా తనకు ఎదురు లేదని వైఎస్సార్సీపీ మరోసారి నిరూపించుకోగలిగింది ఈ ఎన్నికలతో. చంద్రబాబుకు చుక్కలు చూపించింది. ఆయన సొంత నియోజకవర్గం, సొంత గ్రామంలోనూ దుమ్మురేపింది. ఈ రెండు చోట్ల కూడా తెలుగుదేశం ఘోర పరాజయాన్ని చవి చూసింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవితో పాటు అన్ని మండల పరిషత్‌లను కూడా సొంతం చేసుకుంది వైసీపీ. జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం 25 ఎంపీటీసీ స్థానాలకు పరిమితమైంది.

నాటి ఫలితాలకు అద్దం పట్టేలా..

నాటి ఫలితాలకు అద్దం పట్టేలా..

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలోని 89 పంచాయతీలకు గాను 74 చోట్ల వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలపరచిన అభ్యర్థులు విజయం సాధించగా, 14 చోట్ల టీడీపీ మద్దతుదారులు, ఒక చోట కాంగ్రెస్‌ పార్టీ మద్దతుదారు విజయం సాధించారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ టీడీపీ తుడిచి పెట్టుకుపోయింది. గుడుపల్లె, శాంతిపురం, రామకుప్పం, కుప్పం జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో చేజిక్కించుకున్నారు. జిల్లాలో మొత్తం 65 జెడ్పీటీసీ స్థానాలుండగా అన్ని చోట్లా వైసీపీ అభ్యర్థులు విజయదుందుభి మోగించారు.

పక్కా ప్లాన్.. అంతే పక్కాగా ఎగ్జిక్యూషన్..

పక్కా ప్లాన్.. అంతే పక్కాగా ఎగ్జిక్యూషన్..

చిత్తూరు జిల్లాలో ఈ స్థాయిలో అధికార పార్టీ ఘన విజయం సాధించడానికి ప్రధాన కారణం- అదే జిల్లాకు చెందిన పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి. చిత్తూరు జిల్లాలో టీడీపీని దెబ్బకొట్టడానికి ఆయన ఎంత పక్కాగా వ్యూహాలను రూపొందించుకున్నారో అంతే పక్కాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయగలిగారు. గ్రామీణ స్థాయిలో ఓటర్లు వైసీపీకి పట్టం కట్టడానికి మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నాలే కారణమని వైసీపీ అగ్రనాయకత్వం సైతం భావిస్తోంది.

 పిలిచి మరీ అభినందన..

పిలిచి మరీ అభినందన..


ఈ నేపథ్యంలో- కొద్దిసేపటి కిందటే మంత్రి పెద్దిరెడ్డి తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. మర్యాదపూరకంగా ఆయనతో సమావేశమయ్యారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత పెద్దిరెడ్డి.. ముఖ్యమంత్రిని కలుసుకోవడం ఇదే తొలిసారి. చిత్తూరు జిల్లాలో టీడీపీ తుడిచి పెట్టుకుని పోయేలా వ్యూహాలను రూపొందించినందుకు వైఎస్ జగన్ ఈ సందర్భంగా పెద్దిరెడ్డిని అభినందించారు. ఇదే స్ఫూర్తితో కొనసాగాలని సూచించారు. ప్రభుత్వపరంగా, పార్టీ పరంగా ఎలాంటి సహాయ, సహకారాలు కావాలన్నా అందిస్తానని మంత్రికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు.

English summary
AP's Panchayat Raj and Rural development minister Peddireddy Ramachandra Reddy meets Chief Minister YS Jagan MMohan Reddy, after huge victory in ZPTC and MPTC elections.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X