ఇళ్ల పంపిణీ పై ప్రభుత్వం తాజా ప్రకటన - అర్హతలు, కేటాయింపులు ఇలా..!!

ఏపీ ప్రభుత్వం మరో కీలక ప్రకటన చేసింది. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పేదలకు ఇళ్ల పంపిణీ పైన లక్ష్యాలను నిర్ణయించింది. అయిదేళ్లు కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా పేదలకు ఇళ్ల పంపిణీ పూర్తి చేయాలని నిర్దేశించింది. హౌసింగ్ అధికారులకు సమయం డిసైడ్ చేసింది. కాగా.. ఇళ్ల నిర్మాణంతో పాటుగా మధ్యలో నిర్మాణాలు నిలిచిన వారికి అండగా ఉండాలని నిర్ణయం తీసుకుంది. తాజాగా.. ఇళ్ల పంపిణీ పైన మంత్రి పార్ధసారధి కీలక ప్రకటన చేసారు.

గృహనిర్మాణ శాఖ విషయంలో మూడు లక్షల ఇళ్లు పూర్తి చేసిన సందర్భంగా కీ హ్యాండోవర్ కార్యక్రమం నిర్వహించామని మంత్రి పార్ధసారధి వెల్లడించారు. ఇది మంచి ప్రభుత్వం అనే స్పూర్తితో సీఎం, మంత్రులు పనిచేస్తున్నామని చెప్పుకొచ్చారు. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టెక్నాలజీ సహకారంతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో ముందుంటున్నామన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు 8 లక్షల 627 ఇళ్లు పూర్తయ్యాయని గుర్తుచేశారు. అలాగే జగన్ సీఎంగా ఉన్నప్పుడు కేవలం 6 లక్షలు మాత్రమే పూర్తయ్యాయని పార్ధసారధి వివరించారు. 16 నెలల్లోనే 3 లక్షలకు పైగా ఇళ్ళు పూర్తి చేసినట్లు వెల్లడించారు. కాగా, మరో అయిదు లక్షల ఇళ్లు ఉగాదిలోగా పూర్తి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

minister-partha-sarathi-key-announcement-over-allocation-of-housing-for-poor

అయితే, ఇంత వరకు ప్రారంభం కాని ఇళ్లు 3 లక్షల 30 వేల ఇళ్లు ఉన్నాయని వివరించారు. 15.59 లక్షల ఇళ్లు ఈ అయిదేళ్ళలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. హౌసింగ్ ఫర్ ఆల్ అని ఇచ్చిన హమీని నిలబెట్టుకోవాలని రివ్యూలో ముఖ్యమంత్రి చెప్పారన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి గృహప్రవేశం చేయిస్తామని చెప్పారు. ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించేందుకు కామన్ వాల్‌తో కలిపి కట్టుకోవడానికి జీవో ఇస్తామన్నారు. 18 లక్షల ఇళ్లు శాంక్షన్ అయితే 30 శాతం మాత్రమే పూర్తి చేశారని గత ప్రభుత్వంపై మండిపడ్డారు. గత వైసీపీ హయాంలో ఆప్షన్ 3 కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే స్కీంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కాంట్రాక్ట్ తీసుకున్న రాక్రీట్ నిర్మాణ సంస్థ.. స్కీంకు తీరని అన్యాయం చేసిందని మండిపడ్డారు. 47 వేల 850 ఇళ్లు తీసుకుని నిర్మిస్తామని చెప్పి ఎక్కడా పూర్తి చేయలే దన్నారు. ఇప్పటికైనా ఆప్షన్ 3లో పేమెంట్ కింద చివరి దశలో ఉన్న నిర్మాణాలు చేయాలని ప్రభుత్వం ఆదేశించిందని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+