పేర్నినాని వర్సెస్ నాగబాబు ట్వీట్ వార్- మధ్యలో పవన్- రేబిస్ వ్యాక్సిన్‌పై
ఏపీలో పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ చిత్రం వైసీపీ, జనసేన మధ్య చిచ్చు రేపుతోంది. తాజాగా వకీల్ సాబ్ చిత్రం రేట్ల పెంపుకు సంబంధించి మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు జనసేన నేతలతో పాటు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు సైతం మంట పుట్టించాయి. దీంతో ట్విట్టర్ వేదికగా ఆయన మంత్రి పేర్నినానిపై విమర్శలకు దిగారు. దీంతో పేర్నినాని కూడా నాగబాబుకు అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. మధ్యలో పనిలో పనిగా కరోనా భయంతో క్వారంటైన్‌లో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రస్తావన కూడా వచ్చేసింది.
దీంతో వీరిద్దరి ట్వీట్లు ఇప్పుడు తెగ వైరల్ అవుతున్నాయి.

వకీల్ సాబ్ రేపిన చిచ్చు
తిరుపతి ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా వైసీపీ సర్కారుపై రెచ్చిపోయిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. కొన్నిరోజులకే తన కొత్త సినిమా వకీల్ సాబ్ చిత్రానికి టికెట్ల రేట్లు పెంపు కోసం ప్రభుత్వాన్ని ఆశ్రయించాల్సిన పరిస్ధితి వచ్చింది. దీంతో ప్రభుత్వాన్ని అడగలేక హైకోర్టుకు వెళ్లి టికెట్ల రేట్ల పెంపుకు ఆదేశాలు తెచ్చుకున్నారు. అయితే దీన్ని వైసీపీ ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. అంతే వకీల్ సాబ్ టికెట్ల రేట్ల పెంపుకు గండి పడింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై ప్రభుత్వం హౌస్ మోషన్ పిటిషన్ వేసి టికెట్ల రేట్ల పెంపును రెండు రోజులకు కుదించగా.. మరోసారి హైకోర్టును ఆశ్రయించి టికెట్ల రేట్ల పెంపుకు అవకాసం ఇవ్వాలని డిస్టిబ్యూటర్లు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై వైసీపీ, జనసేన మధ్య తీవ్ర మాటలయుద్దం సాగుతోంది.
పేర్నినాని వ్యాఖ్యలపై నాగబాబు ట్వీట్
తాజాగా వకీల్ సాబ్ చిత్ర టికెట్ల రేట్ల పెంపు వివాదం నేపథ్యంలో మంత్రి పేర్నినాని చేసిన వ్యాఖ్యలపై నటుడు నాగబాబు ఫైర్ అయ్యారు. పేర్నినానిని ఉద్దేశించి ఆయన ఓ షాకింగ్ ట్వీట్ పెట్టారు. పేర్నినాని కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడాన్ని గుర్తు చేస్తూ మీకు ఏమి అయ్యింది నాని గారు.మీరు కారోనా వాక్సిన్ తో పాటు రాబిస్ వాక్సిన్ వేసుకోవాలి.ఇట్స్ అర్జంట్.please సెండ్ రాబిస్ వాక్సిన్ to మిస్టర్ నాని.స్టేట్ transposrt మినిస్టర్.వాక్సిన్ డొనేట్ చేయాలనుకునే వారు ఆయన పెరు చెబితే రవాణా ఖర్చులు ఫ్రీ అంటూ ట్వీట్ చేశారు. దీంతో ఈ వార్ మరో మలుపు తీసుకుంది.
నాగబాబు ట్వీట్‌కు పేర్ని ఘాటు కౌంటర్
తాను కరోనా వ్యాక్సిన్‌తో పాటు కుక్క కాటుకు వేసే రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోవాలంటూ నాగబాబు చేసిన సూచనపై మంత్రి పేర్నినాని మండిపడ్డారు. నాగబాబుకు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. నాగబాబు అకౌంట్‌ను ట్యాగ్ చేస్తూ పేర్ని నాని చేసిన ట్వీట్‌లో నాగబాబుతో పాటు పవన్ కళ్యాణ్‌ను కూడా ఆయన వార్‌లోకి లాగారు. తాజాగా తిరుపతి ప్రచారం నుంచి తప్పుకుని క్వారంటైన్‌లోకి వెళ్లిన పవన్ కళ్యాణ్‌ను కూడా లాగుతూ పేర్నినాని ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు మరింత వైరల్ అవుతోంది.

పవన్, నాగబాబుకు రేబిస్ వ్యాక్సిన్
తాను కరోనా వ్యాక్సిన్‌తో పాటు కుక్కకాటుకు వేసే రేబిస్ వ్యాక్సిన్ వేయించుకోమంటూ సలహా ఇచ్చిన నటుడు నాగబాబుకు ఇచ్చిన కౌంటర్లో మంత్రి పేర్ని నాని...పరోపకారి పాపన్న NagaBabuOffl గారు, పేర్నినాని లాంటి బయటివారి కన్నా ముందు మనింట్లో తిరుగుతున్న జనసేన పవన్ కళ్యాణ్ కు రాబిస్ వాక్సిన్ తక్షణ అవసరం వెంటనే వెతికి వేయించండి.ఆలస్యమైతే మీకు కూడా అవసరమౌతుంది.అన్నదమ్ములిద్దరికీ వ్యాధి తగ్గిన తరువాత అప్పటికీ అవసరమైతే మీ దగ్గర తీసుకుంటాడు అంటూ కడిగి పారేశారు. దీంతో పేర్ని వర్సెస్ నాగబాబు ట్వీట్ వార్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications