పెద్దిరెడ్డికి ఝలక్ ఇచ్చిన చంద్రబాబు, ప్రాజెక్టు బాధితులు ఎంత మందో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు నాయుడు మార్క్ రాజకీయాలు మొదలైనాయి. ప్రజలకు న్యాయం చేస్తామని, ప్రజల సమస్యలు పరిష్కరించడానికి తాము మొదటి ప్రధాన్యత ఇస్తామని సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పదేపదే చెబుతున్న విషయం తెలిసింది. చంద్రబాబు సొం జిల్లా చిత్తూరులో ఇప్పుడు ప్రజా సమస్యలపై ప్రజా దర్బార్ మొదలైయ్యింది.

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అవినీతి అక్రమాలపై ఆ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్ రెడ్డి బృందంతో కూడిన టీడీపీ శ్రేణులు క్షేత్రస్థాయి పర్యటన చేపట్టారు. చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజక వర్గంలోని ఆవులపల్లి ప్రాజెక్టులో జరిగిన అవినీతి అక్రమాలపై రైతులతో క్షేత్రస్థాయి పర్యటనలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి నేరుగా బాధితులతో మాట్లాడారు.

Minister Ramprasad Reddy gave courage to Peddireddy victims in Punganur

మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలపై ఆయన కంచుకోట అయిన పుంగనూరులో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. మంత్రి ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. పుంగనూరు నియోజకవర్గంలోని మండల్లో పర్యటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి టీడీపీ కార్యకర్తలకు ధైర్యం చెప్పారు. ఇంతకాలం పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అరాచకాలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న టీడీపీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు.

టీడీపీ పుంగనూరు నియోజకవర్గ ఇన్ చార్జ్ చల్లా రామచంద్రా రెడ్డితో పాటు టీడీపీ సీనియర్ నాయకులతో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించిన మంత్రి రాంప్రసాద్ రెడ్డికి అనేక మంది బాధితులు పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరుల మీద ఫిర్యాదులు చేశారు. అనంతరం టీడీపీ కార్యకర్తలను ఉద్దేశించి అవులపల్లె ప్రాజెక్టు దగ్గర బహిరంగ సభలో మాట్లాడిన మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల మీద సంచలన వ్యాఖ్యలు చేశారు.

అవులపల్లె ప్రాజెక్టు పరిధి మొత్తం 1,687 ఎకరాలు అని, అందు కోసం గత వైసీపీ ప్రభుత్వం అండతో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి తీసుకున్న 850 ఎకరాల భూములు కేవలం 83 మంది రైతులవే అని మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఇర్లపల్లి, పెద్దదేవలకుప్పం, చిన్నదేవలకుప్పం, భయ్యారెడ్డిపల్లె, రామక్రిష్ణాపురంకు చెందిన 176 కుటుంబాలు పుంపు ప్రాంతాల బాధితులుగా ఉన్నారని తమకు తెలిసిందని మంత్రి రాంప్రసాద్ రెడ్డి చెప్పారు.

Minister Ramprasad Reddy gave courage to Peddireddy victims in Punganur

గత వైసీపీ ప్రభుత్వంలో, పెద్దిరెడ్డి అరాచకాలతో అన్యాయానికి గురైన బాదితులను ఆదుకుంటామని, టీడీపీ కార్యకర్తలకు తాము అండగా ఉంటామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి భరోసా ఇచ్చారు. పుంగనూరు నియోజక వర్గంలోని అనేక మంది బాధితులు పెద్దిరెడ్డితో పాటు ఆయన అనుచరుల నుంచి కాపాడాలని మంత్రి రాంప్రసాద్ రెడ్డికి పెద్ద సంఖ్యలో వినతి పత్రాలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పుంగనూరు నియోజక వర్గానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు బాధితులను మంత్రికి పరిచయం చేశారు.

అవులపల్లె ప్రాజెక్టు కోసం రైతుల నుంచి తీసుకున్న భూములకు ఇంత వరకు ఒక్కరికి కూడా పరిహారం ఇవ్వలేదని, జగన్ ప్రభుత్వం, పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి ఇక్కడ భూములు ఇచ్చిన రైతులకు అన్యాయం చేశారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు. గత వైసీపీ ప్రభుత్వం, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దౌర్జన్యంగా అవులపల్లె ప్రాజెక్టు కోసం రైతుల నుంచి భూములు లాక్కొన్నారని మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపించారు.

టీడీపీ శ్రేణుల క్షేత్రస్థాయి పర్యటననలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలు, భూముల దందాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా చట్టం నుంచి తప్పించుకోలేరని, పుంగనూరు నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి అవినీతి అక్రమాలను బయటకు తీస్తామని, త్వరలో ఆయన భాగోతం మొత్తం ప్రజల ముందు పెడుతామని ఆంధ్రప్రదేశ్ మంత్రి రాంప్రసాద్ రెడ్డి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+