నగరిలో అయినా.. కుప్పంలోనైనా.. దమ్ముంటే రా; చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ !!

టిడిపి అధినేత చంద్రబాబుకు మంత్రి రోజా సవాల్ విసిరారు. ప్రజల్లోకి మేనిఫెస్టోలతో వెళదామని, ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజలే చెబుతారని పేర్కొన్న రోజా మీ మేనిఫెస్టో తెచ్చుకో.. మా మేనిఫెస్టో తెస్తాం ఎవరి మేనిఫెస్టో పూర్తయిందో ప్రజల్ని అడుగుదామంటూ ఛాలెంజ్ చేశారు. చంద్రబాబు అప్పుడు ఎవరితో సెల్ఫీ తీసుకుంటారో చూద్దామంటూ సెటైర్లు వేసిన రోజా, తాను విసిరిన సవాల్ ను స్వీకరించే దమ్ము చంద్రబాబుకు ఉందా అంటూ వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు జగన్ స్టిక్కర్ల మీద చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారని పేర్కొన్న రోజా సీఎం జగన్ పాలనను ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి తాము ప్రజల్లోకి వెళ్ళగలుగుతున్నామన్నారు. టిడిపి, జనసేన నాయకులు దొంగతనంగా వెళ్లి పోటాపోటీగా స్టిక్కర్లు అంటిస్తున్నారని ఆపై తమ ఎల్లో మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారని రోజా విమర్శించారు. టిడ్కో ఇళ్ల దగ్గర చంద్రబాబు సెల్ఫీలు తీసుకుంటున్నారని మండిపడిన రోజా ఆయనకు ఆయనే సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు.

 cbn-roja-

నగరిలో అయినా, కుప్పంలో అయినా.. ఏ ఇంటికి ఎంత లబ్ధి చేకూరిందో చూద్దామా చంద్రబాబు అంటూ సవాల్ విసిరిన రోజా చంద్రబాబును టార్గెట్ చేశారు. గతంలో రాజకీయాల్లో ప్రజలను 100% సంతృప్తి పరచగలమా అనే అనుమానం ఉండేదని, కానీ జగన్ పాలనలో చేసి చూపించారని పేర్కొన్నారు. మెగా సర్వే చేయడానికి దమ్ము ఉండాలని సీఎం జగన్ కు దమ్ముంది కాబట్టే 7 లక్షల మంది సర్వేలో పాల్గొంటున్నారన్నారు రోజా.

ప్రజలంతా వైసీపీని ఆదరిస్తున్నారని, జగన్ నాయకత్వాన్ని ప్రజలంతా కోరుకుంటున్నారని రోజా చెప్పారు. జగన్ పాలనలో అందరికీ న్యాయం చేశారు కాబట్టే ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని రోజా వ్యాఖ్యానించారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకుని జనంలోకి వెళుతున్నారని ప్రశ్నించిన రోజా ఈ రాష్ట్రానికి పట్టిన క్యాన్సర్ గడ్డ చంద్రబాబు అంటూ మండిపడ్డారు.

 cbn-roja-

చంద్రబాబు ఓటుకు నోటు కేసులో హైదరాబాద్ నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తని, ప్రత్యేక హోదా వద్దని ప్యాకేజీ తీసుకొని రాష్ట్రాన్ని నాశనం చేశాడని రోజా విమర్శించారు. యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని మోసం చేశారని, రైతులకు రుణమాఫీ ఇస్తానని మోసం చేశారని నిప్పులు చెరిగారు. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేస్తున్న చంద్రబాబు ఇప్పుడు ప్రజల వద్దకు వెళ్లి నోటికొచ్చినట్టు మాట్లాడితే ఆయనను నమ్మేవారు ఎవరూ లేరన్నారు మంత్రి రోజా.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+