పబ్ లో మంత్రి రోజా డ్యాన్స్ .. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!!
ఏ చిన్న అవకాశం దొరికినా టీడీపీ అధినేత చంద్రబాబును, లోకేష్ ను, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేసే రోజాను ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ టార్గెట్ చేస్తున్నారు. అందరికీ సుద్దులు చెప్పే మంత్రి రోజా మాత్రం వాటిని పాటించరని నెట్టింట నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు తమ సమస్యలను పరిష్కరించండి మహాప్రభో అంటూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా పట్టించుకోకుండా మంత్రి రోజా చేసే పనులేమిటి అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ మంత్రి రోజా ఏం చేశారంటే.. మంత్రి రోజా నూతన సంవత్సర వేడుకలను బెంగళూరులో జరుపుకున్నారు. ఆమె బెంగళూరులోని ఒక పబ్ లో డ్యాన్సులు వేస్తూ స్నేహితులు, బంధువులతో బాగా సెలబ్రేట్ చేసుకున్నారు.

బెంగళూరు పబ్ లో పాటలకు లయబద్దంగా స్టెప్పులు వేస్తూ తెగ ఎంజాయ్ చేశారు రోజా. బ్లాక్ కలర్ డ్రస్ లో రోజా పబ్ లో వేసియా చిందులు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందరికీ నీతులు చెప్పే మంత్రి రోజా తాను మాత్రం పాటించేది లేదని ఈ వీడియో చూసిన నెటిజన్లు రోజాను టార్గెట్ చేస్తున్నారు.
గతంలో మంత్రిగా భూమా అఖిల ప్రియ ఉన సమయంలో చుడీదార్ వేసుకుని వెళ్తేనే టార్గెట్ చేసిన రోజా ఎన్టీఆర్ పెట్టిన పార్టీలో సంప్రదాయంతో ఉండాలని పేర్కొన్నారు. చుడీదార్ వేసుకుని తిరగటం తప్పని, ప్రజాసేవలో లేకపోతే నైటీ వేసుకున్నా పర్లేదు అని అప్పుడు ఆమె వ్యాఖ్యలు చేశారు. భూమా అఖిల ప్రియను టార్గెట్ చేశారు.
రాష్ట్రంలో అంగన్వాడీలు, పారిశుధ్య కార్మికులు రోడ్లపై నిరసనలు, ఆక్రందనలు... ఇవేమీ పట్టని ఆంధ్రప్రదేశ్ మంత్రులు
— Ramya Paruchuri (@Ramya47618518) January 1, 2024
బెంగళూరు పబ్బుల్లో చిందులు..!🤦🏻♀️#RojaSelvamani #IdemKharmaManaRashtraniki
#WhyAPHatesJagan #ByeByeJaganIn2024 #JaganLosingIn2024 #JaganPaniAyipoyindhi pic.twitter.com/loV6GKHEGt
ఇక ఇప్పుడు మంత్రి హోదాలో ఉన్న రోజా రాష్ట్రంలో ఎన్నో ఆందోళనలు కొనసాగుతున్నా, సమస్యల పరిష్కారం కోసం రోజుల తరబడి ఆందోళనలు చేస్తున్నా అవేవీ పట్టనట్టు బెంగళూరు పబ్ కు వెళ్లి ఎంజాయ్ చెయ్యటం నెటిజన్లకు ఆయుధంగా మారింది, దీంతో రోజాను దారుణంగా ట్రోల్స్ చేస్తునారు. ఇక టీడీపీ నాయకులు సైతం రోజాపై మండిపడుతున్నారు. ఈమె ఒక మంత్రినేనా అంటూ ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications