అక్కినేని పై బాలయ్య వ్యాఖ్యల వివాదంలో మంత్రి రోజా కొత్త ట్విస్ట్..!!
అక్కినేనిపై బాలకృష్ట వ్యాఖ్యల వివాదంపై నాగార్జన స్పందించాలని మంత్రి రోజా డిమాండ్.
వీరసింహారెడ్డి సక్సెస్ మీట్ నందమూరి బాలకృష్ట చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద దుమారానికి కారణవుతున్నాయి. అక్కినేని..ఎస్వీఆర్ అభిమానులు బాలయ్య వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్య కు కాపునాడు డెడ్ లైన్ విధించనగా..అక్కినేని అభిమానులు నిరసనలకు దిగారు. ఇదే సమయంలో మంత్రి రోజా తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. బాలయ్య చేసిన వ్యాఖ్యలపైన నాగార్జున స్పందించాలన్నారు. బాలయ్య వ్యాఖ్యలతో అక్కినేని అభిమానులు బాధపడ్డారని చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో పవన్ కల్యాణ్ పైన రోజా సంచలన వ్యాఖ్యలు చేసారు.

పవన్ రీల్ హీరో - జగన్ రియల్ హీరో
పవన్ కల్యాణ్ పార్టీ జనసేన కన్ ఫ్యూజన్ పార్టీగా మంత్రి రోజా పేర్కొన్నారు. పార్టీ ఏర్పాటు నుంచి ఎప్పడూ ఏదో పార్టీకి ఓట్లు వేయండంటూ ప్యాకేజీలో ప్రచారం చేయటం మినహా ఏం చేసారని నిలదీసారు. నాడు టీడీపీని తరిమికొడతానన్న పవన్ ఆ మాటకు నిలబడి ఉండాలని డిమాండ్ చేసారు. ఒకసారి బీజేపీకి ఓటేయండి..మరోసారి బీఎస్పీకి ఓటు వేయమని..ఇప్పుడు టీడీపీ కోసం పవన్ ప్రచారం చేస్తున్నారని ఎద్దేవా చేసారు. పవన్ వి అన్నీ కామెడీ చేష్టలేనని వ్యాఖ్యానించారు. పవన్ రీల్ హీరోనని..సినిమాల్లో చెప్పే డైలాగులు రాజకీయాల్లో పని చేయవన్నారు. జగన్ రియల్ హీరోగా రోజా అభివర్ణించారు. పార్టీ పెట్టిన సమయం నుంచి దమ్మున్న నేతగా సింగిల్ గానే జగన్ పోరాటం చేస్తున్నారని ఒకే జెండా..ఒకటే అజెండాతో నిలిచారని చెప్పుకొచ్చారు.

నాగార్జున సమాధానం చెప్పాలి
తాజాగా బాలయ్య చేసిన వ్యాఖ్యలపైన రోజా స్పందించారు. బాలకృష్ణ అక్కినేనిని అవమానించడం తప్పన్నారు. ఎన్టీఆర్‌ని అవమానిస్తే వీళ్ళు ఎంత బాధ పడతారో, అదే విధంగా అక్కినేని అభిమానులు కూడా బాధపడతారన్నారు. ఆ విషయంపై ఇప్పటి వరకూ బాలకృష్ణ తప్పును సరిదిద్దుకోలేదన్నారు. ఆయన ఎప్పుడు సరిదిద్దుకోడన్నారు. బాలయ్యకు వయసు పెరిగినా..మార్పు రాలేదని వ్యాఖ్యానించారు. బాలయ్య వ్యాఖ్యలపైన నాగార్జున సమాధానం చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేసారు. రెండు సార్లు ఎమ్మెల్యే అయినా బాలయ్య తీరులో మార్పు లేదని ఆగ్రహం వ్యక్తం చేసారు. అక్కినేని అభిమానుల ఆందోళనలో అర్దం ఉందని రోజా చెప్పుకొచ్చారు.

లోకేష్ యాత్ర కు అంత సీన్ లేదు
లోకేష్ ది యువగళం కాదు టిడిపి సర్వమంగళం పాడే గళమని ఎద్దేవా చేసారు. పాదయాత్రతో ఏదేదో జరిగిపోతుందని భ్రమలో ఉన్నారన్నారు. పాదయాత్రలో మొదటి రోజే వాళ్ళకి అంతలేదు అని అర్థం అయిపోతుందని రోజా విమర్శించారు. లోకేష్ తెలుగుదేశం పార్టీలోకి వచ్చినప్పటి నుంచి పార్టీ అన్ని విధాలుగా దెబ్బతిన్నదని ఎద్దేవా చేశారు.కేవలం ముఖ్యమంత్రిని తిట్టడానికే పాదయాత్ర అని రోజా ఫైర్ అయ్యారు. రెండో రోజుకే లోకేష్ పాదయాత్ర ఏంటో తేలిపోతుందని మంత్రి రోజా వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications