బండారుతో పాటు వారిపై పరువునష్టం దావా వేసిన మంత్రి రోజా!!
రాజకీయాలలో ఎప్పుడూ చురుకుగా ఉండే రోజా ప్రత్యర్థి పార్టీలపై విరుచుకుపడుతూ తనదైన దూకుడును కొనసాగిస్తూ ఉంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న రోజా చంద్రబాబు అరెస్టు తరువాత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరుపై టిడిపి నేతలు తీవ్రస్థాయిలో భగ్గుమన్నారు.
టిడిపి నేత బండారు సత్యనారాయణ మంత్రి రోజాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడి, అనుచిత వ్యాఖ్యలు చేశారు. రోజా బతుకేంటో తనకు తెలుసని అన్నారు . దీంతో మీడియా ముఖంగా కన్నీటి పర్యంతమైన రోజాకు సినీ వర్గాల నుండి, రాజకీయ వర్గాల నుండి మద్దతు లభించింది. ఇక ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దుమారం రేపిన విషయం తెలిసిందే.

అయితే తాజాగా మంత్రి రోజా తనను కించపరుస్తూ మాట్లాడిన వారి వీడియోలు మేజిస్ట్రేట్ కు చూపించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణ పై పరువు నష్టం దావా వేశారు. మాజీ మంత్రి బండారు సత్యనారాయణ తో పాటు మరో ఇద్దరి పైన కూడా పిటిషన్ వేసిన రోజా నగరి టిడిపి ఇన్చార్జి గాలి భాను ప్రకాష్ తోపాటు, టీవీ5 ఇంచార్జ్ రాజేంద్రప్రసాద్ పేర్లను పిటిషన్లో పొందుపరిచారు.
రోజా పిటిషన్ స్వీకరించిన కోర్టు రోజా స్టేట్మెంట్ ను నమోదు చేసింది. తనపై వ్యక్తిత్వ హననానిని పాల్పడ్డారని, తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటీషన్ లో పేర్కొన్నారు. మంత్రి రోజాపై అసభ్య పదజాలంతో బండారు సత్యన్నారాయణ చేసిన వ్యాఖ్యలపై గతంలోనే గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
రోజా గతంలో అశ్లీల చిత్రాలలో నటించారని, ఆ వీడియోలు కూడా తన వద్ద ఉన్నాయని బండారు సత్యన్నారాయణ వ్యాఖ్యలు చేయటంతో దుమారం రేగింది. ఆ తర్వాత అనేక పరిణామాలు చోటు చేసుకోగా, తాజాగా మంత్రి రోజా పరువు నష్టం దావా వెయ్యటం మరోమారు ఏపీ రాజకీయాలపై ఆసక్తిని రేకెత్తించింది.
-
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..!












Click it and Unblock the Notifications