చిన్నారి వైద్యం కోసం జగన్ ను కలిసి.. మంత్రి రోజా ఔదార్యం!!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి, నగరి ఎమ్మెల్యే రోజా తన ఔదార్యాన్ని మరోమారు చాటుకున్నారు. ఎవరికైనా సహాయం చేయాలంటే ముందు వరుసలో నిలిచే రోజా నగరిలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ మహేష్ యొక్క ఏడు నెలల కుమార్తెకు వైద్య చికిత్స కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా సత్వర సహాయాన్ని అందించి, మీ చిన్నారి క్షేమంగా ఇల్లు చేరుతుంది అంటూ ఆ తండ్రికి భరోసా ఇచ్చారు.
ఇక అసలు విషయానికి వస్తే మంత్రి ఆర్కే రోజాను తన కుమార్తె అనారోగ్య పరిస్థితి నేపథ్యంలో నగరి ఆసుపత్రిలో పనిచేస్తున్న, తిరుమల వాస్తవ్యుడైన డాక్టర్ కలవగుంట మహేష్ కలిశారు. తమ చిన్నారి బేబీ రుద్రాంక్షి బైలియరి అట్రిసియం తో బాధపడుతుందని ఆర్గాన్ మార్పిడి ఆపరేషన్ కోసం ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి నిధులు మంజూరు చేయించాలని ఆయన మంత్రి రోజాకు విజ్ఞప్తి చేశారు.

దీంతో వెంటనే స్పందించిన మంత్రి రోజా చిన్నారి సమస్య తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విజయవాడలో నేరుగా కలిసి, చిన్నారి ఆరోగ్య పరిస్థితిని వివరించి ముఖ్యమంత్రి సహాయనిధి నుండి చిన్నారి ఆపరేషన్ కోసం అవసరమైన 22 లక్షల రూపాయల నగదును మంజూరు చేయించి చిన్నారి తండ్రి మహేష్ కు అందజేశారు.
ఎందరికో వైద్యం చేశావు..నీ కూతురు క్షేమంగా తిరిగి వస్తుంది..!!#RojaSelvamani #MLARoja #YSRCP #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/5TOXMEfr2L
— oneindiatelugu (@oneindiatelugu) April 5, 2023
చిన్నారికి త్వరగా ఆపరేషన్ చేయించాలని, పాపకు అవసరమైన వైద్యం కోసం తాము రేలా ఇన్స్టిట్యూట్ అండ్ మెడికల్ సెంటర్ చెన్నై ఆసుపత్రి నిర్వాహకులతో సైతం మాట్లాడామని పేర్కొన్నారు. మీ పాప ఆరోగ్యంగా తిరిగి ఇంటికి చేరుతుందని, ధైర్యంగా వెళ్లాలని సూచించారు. క్షేమంగా వెళ్లి సంపూర్ణ ఆరోగ్యంతో చిన్నారి రుద్రాంక్షితో కలిసి మళ్ళీ తన వద్దకు రావాలని ఆకాంక్షించారు. డాక్టర్ గా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన మీకు, ఎందరినో ఆదుకున్న మీకు, మీ పాపకి మంచి జరుగుతుందని ధైర్యం చెప్పిన మంత్రి ఆర్కే రోజా మీ వెంట మేమున్నామంటూ పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications