కాశీ వీధుల్లో రిక్షాలో మంత్రి రోజా చక్కర్లు.. సోషల్ మీడియాలో వైరల్ వీడియోలు
మంత్రి రోజా కాశీ వీధుల్లో రిక్షాలో తిరిగిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా రిక్షా ఎక్కి చక్కర్లు కొట్టడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజా ఏం చేసినా సంచలనమే. ఇప్పటివరకు ఆమె అంబులెన్స్ నడిపినా, ట్రాక్టర్ తోలినా.. బస్సులు నడిపినా, దిశా వాహనాలపై, బైక్ లపై రైడ్ చేసిన ప్రతి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గానే మారింది. ఇక ప్రస్తుతం ఆమె రిక్షా ఎక్కి చక్కర్లు కొట్టిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు హల్చల్ చేస్తుంది.

రిక్షాలో సరదాగా రోజా
ఇటీవల శివరాత్రి సందర్భంగా ఆధ్యాత్మిక నగరమైన వారణాసికి వెళ్లి, కాశీ విశ్వనాథుని దర్శించుకుని పవిత్ర గంగానది హారతి కార్యక్రమం లో రోజా పాల్గొన్నారు. మంత్రి రోజా తన కాశీ పర్యటన నేపథ్యంలో తన స్నేహితురాలితో కలిసి రిక్షా ఎక్కి నగరంలో పర్యటించారు. స్వతహాగా భక్తురాలైన రోజా మహాశివరాత్రి పర్వదినం రోజున, శని త్రయోదశి కూడా రావడంతో కాశీకి వెళ్లి పూజలు నిర్వహించారు. గంగా హారతిలో కూడా పాల్గొని తన ఆధ్యాత్మికతను చాటుకున్నారు. అంతేకాదు స్నేహితురాలితో కలిసి రిక్షా ఎక్కి సరదా కూడా తీర్చుకున్నారు.
కాశీ వీధుల్లో స్నేహితురాలితో రోజా చక్కర్ల వీడియో వైరల్
కాశీ వీధుల్లో స్నేహితురాలితో సరదాగా ముచ్చట్లు చెప్పుకుంటూ రిక్షాలో తిరిగిన రోజా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన స్నేహితురాలితో కలిసి కాశీలో అనుభవాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న రోజా తన ఆనందాన్ని తెలియజేశారు. ఇక మంత్రి రోజా రిక్షా ఎక్కి తిరగడంపై నెటిజెన్లు స్పందిస్తున్నారు. మంత్రి అనే హోదాని పక్కనపెట్టి రోజా చాలా సామాన్యంగా వ్యవహరిస్తున్నారని, సింప్లిసిటీతో ఉన్నారు అంటూ పలువురు నెటిజన్లు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేస్తున్నారు.

కాశీలోనూ మంత్రి రోజా సందడి
సాధారణ భక్తురాలిగా కాశీలో రిక్షాలో తిరిగిన రోజా తాను సెలబ్రిటీని అని మరచిపోయి సందడి చేశారు. కాశీకి వచ్చిన భక్తులలో ఒకరిగా కలిసిపోయి పర్యటించారు. మీరు రిక్షాలో వెళ్లడం సూపర్ గా ఉంది మేడం.. అంటూ పర్యాటక శాఖ మంత్రి రోజాపై పలువురు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక ఇంతకీ రిక్షా అతనికి డబ్బులు ఇచ్చారా లేదా అంటూ సరదాగా కొందరు ప్రశ్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications