జగన్ ట్రెండ్ సెట్టర్ - మరోసారి రుజువైంది : మంత్రి రోజా..!!

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ పై మంత్రి రోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ పై మంత్రి రోజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై చర్చలో మాట్లాడిన రోజా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సుకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. 44 నెలల్లోనే తన నాయకత్వంలో, తన పరిపాలనతో ఇంతమంది పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చారంటే.. సీఎం వైయస్‌ జగన్‌ ఇమేజ్‌ దేశ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు.

సీఎం జగన్‌ ఎప్పుడు ఏది చేసినా ట్రెండ్‌ చేస్తారన్నారు రోజా. ఈ సమ్మిట్‌తో ట్రెండ్‌ సెట్టర్‌ అని మరోసారి నిరూపించుకున్నారని చెప్పారు. పరిశ్రమలు తరలిపోతున్నాయి, పారిశ్రామికవేత్తలు రావడం లేదని టీడీపీ చేసిన గోబెల్స్‌ ప్రచారాన్ని గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌తో తిప్పికొట్టామని రోజా పేర్కొన్నారు. సీఎం జగన్‌ తీసుకువచ్చిన ఎన్నో చరిత్రాత్మకమైన నిర్ణయాలు చూసి పారిశ్రామిక వేత్తలు కూడా నమ్మకంతో మన రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర ప్రగతిలో భాగస్వామ్యం అవుతామని చెప్పారంటే ఇది సీఎం జగన్‌ విజయంగా అభివర్ణించారు. ఒక నాయకుడు తన పార్టీ పెట్టి పదేళ్లు అయ్యిందని సభ పెట్టి దారినపోయేవారితో ఎంవోయూలు చేయించారని మాట్లాడారంటూ పరోక్షంగా పవన్ వ్యాఖ్యలను ప్రస్తావించారు. ముఖేష్‌ అంబానీ, కరన్‌ అదానీ, జిందాల్, దాల్మియా, ఒబేరాయ్‌ వంటి పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలను దారినపోయేవారు అన్నారంటే ఆ మనిషికి నిజంగా లోకజ్ఞానం ఉందా అంటూ ప్రశ్నించారు.

Minister Roja says CM Jagan stands as youth Icon, Strong counter to Pawan Kalayn in Assembly

దేశంలోనే అత్యధిక వృద్ధిరేటుతో అద్భుతంగా సీఎం జగన్‌ పరిపాలన చేస్తున్నారని స్వయంగా ముఖేష్‌ అంబానీ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌లో అన్నారని మంత్రి రోజా గుర్తు చేసారు. జే అంటే జగన్‌.. జే అంటే జోష్‌.. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి వైయస్‌ జగన్‌తోనే సాధ్యమని పునీత్‌ దాల్మియా ప్రశంసించారంటే ఇంతకంటే సర్టిఫికెట్‌ ఏం కావాలని వ్యాఖ్యానించారు. సంక్షేమం, అభివృద్ధిని రెండింటినీ అద్భుతమైన రీతిలో ముందుకు తీసుకెళ్తున్నారని రోజా చెప్పుకొచ్చారు.

Minister Roja says CM Jagan stands as youth Icon, Strong counter to Pawan Kalayn in Assembly

రాబోతున్నాయి. యువత గురించి ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి మన యూత్‌ ఐకాన్‌ సీఎం వైయస్‌ జగన్‌. అధికారంలోకి రాగానే సచివాలయ వ్యవస్థ తెచ్చి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు. పరిశ్రమల్లో స్థానికులకు 75 శాతం ఇవ్వాలని చట్టం తేవడమే కాకుండా.. పారిశ్రామిక వేత్తలు ఇబ్బందిపడకుండా మన పిల్లలకు వృత్తినైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నారని మంత్రి రోజా వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+