నెక్స్ట్ ఆ ముగ్గురూ అరెస్ట్ కు రెడీ కావాలి: మంత్రి రోజా సెన్సేషన్!!

టీడీపీ అధినేత చంద్రబాబుపై మంత్రి ఆర్కే రోజా సెటైర్లు వేశారు . చంద్రబాబు అరెస్టు నాటి నుండి జైలుకు వెళ్లడం వరకు ప్రతి ఎపిసోడ్ లోనూ ఆమె తనదైన శైలిలో స్పందించారు. తాజాగా చంద్రబాబుతో పాటు టిడిపి నాయకులకు హెచ్చరికలు జారీ చేస్తూ మంత్రి రోజా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబుపై పెట్టిన కేసు అక్రమ కేసు కాదని ఇది అడ్డంగా దొరికిపోయిన కేసని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. అన్ని సాక్ష్యాధారాలతో దొరికి పోయిన తర్వాత కక్ష సాధింపు చర్యలు అంటున్నారని మంత్రి రోజా ఎద్దేవా చేశారు. ఇంతకాలం వ్యవస్థలను మేనేజ్ చేసి అన్ని కేసులలో స్టేలు తెచ్చుకొని, ఇంతకాలం చంద్రబాబు కాలం గడిపాడని మంత్రి రోజా మండిపడ్డారు.

Minister roja sensation: those three should be ready for arrest!!

తప్పులు చేసే చంద్రబాబుకు శిక్ష పడాలని తాను భగవంతుని కోరుకున్నానని అందుకే చంద్రబాబు సాక్ష్యాధారాలతో సహా జైలుకు వెళ్లారని మంత్రి రోజా పేర్కొన్నారు. స్నేహ బారక్ లో చంద్రబాబుకు ప్రత్యేక గది ఇచ్చి, ఖైదీ నెంబర్ 7691 కేటాయించి సీసీ కెమెరాలతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారని, అయినా బయట నారా లోకేష్, అచ్చెన్నాయుడు బయట ఓవర్ యాక్షన్ చేస్తున్నారని మండిపడ్డారు.

ఇంకా అనేక స్కాముల లో చంద్రబాబు హస్తం ఉందని పేర్కొన్న మంత్రి రోజా, అవన్నీ కూడా బయటకు వస్తాయని అన్ని కేసులలో చంద్రబాబుకు శిక్ష తప్పదని వ్యాఖ్యలు చేశారు. గతంలో టిడిపి హయాంలో మంత్రులుగా వ్యవహరించిన నారా లోకేష్, నారాయణ , అచ్చెన్నాయుడు కూడా అరెస్ట్ కావడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి రోజా పేర్కొన్నారు.

చంద్రబాబు కోట్ల రూపాయలతో హైదరాబాద్లో ప్యాలెస్ ఎలా కట్టుకున్నాడని ప్రశ్నించిన మంత్రి రోజా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే, చంద్రబాబు తాను ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేయమంటే, ఏపీ నష్టాలలో ఉందని కాకి కబుర్లు చెప్పి తప్పించుకునే వాడని వ్యాఖ్యానించారు. సీఎం జగన్ యూత్ ఐకాన్ అని, ఆయన రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారని, పారదర్శక పాలన చేస్తున్నారని మంత్రి రోజా పేర్కొన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+