లోకేశ్..నీ కొడుకు మీద ప్రమాణం చేసి చెప్పు - మంత్రి రోజా..!!
మంత్రి రోజా మరోసారి టీడీపీ నేత నారా లోకేశ్ పైన ఫైర్ అయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్ తిరుమలకు వెళ్లారు. బ్రహ్మోత్సవాలలో భాగంగా ఏపీ ప్రభుత్వం తరపున సీఎం జగన్ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సమయంలో లోకేశ్ చేసిన ఒక ట్వీట్ సంచలనంగా మారింది. దీనికి స్పందనగా మంత్రి రోజా పలు ప్రశ్నలతో ట్వీట్ చేసారు. లోకేశ్ సీఎం జగన్ ను ఉద్దేశించి వేంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేయాలని డిమాండ్ చేయగా..రోజా తన ట్వీట్ లో లోకేశ్ ను ఆయన కుమారుడి పైన ప్రమాణం చేసి చెప్పాలంటూ డిమాండ్ చేసారు.
సీఎం తిరుల పర్యటన వేళ..లోకేశ్
ముఖ్యమంత్రి తిరుమల పర్యటన వేళ ..లోకేశ్ చేసిన ట్వీట్ లో .... వివేకా గారి హత్య తో నాకు, నా కుటుంబానికి సంబంధం లేదని 14-4-21 న కలియుగ ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశాను. బాబాయ్ హత్య తో మీకు, మీ కుటుంబ సభ్యులకు సంబంధం లేదని శ్రీవారి సాక్షిగా ప్రమాణం చెయ్యడానికి సిద్ధమా జగన్ రెడ్డి?..అంటూ ప్రశ్నించారు. వివేకా హత్య వ్యవహారంలో ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే ఈ వ్యవహారం పైన సీబీఐ విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో వివేకా కుమార్తె సునీత ఈ కేసు విచారణ అంశం పైన సుప్రీంకు వెళ్లారు. ఈ సమయంలో మరోసారి టీడీపీ నేతలు ఈ కేసు ఆంశంలో విమర్శలు ప్రారంభించారు

లోకేశ్ కు రోజా వరుస ప్రశ్నలు
దీని పైన మంత్రి రోజా స్పందించారు. వరుస ప్రశ్నలతో ట్వీట్ చేసారు. అందులో..అమ్మవారి గుడిలో కిరీటాలు ఎత్తుకుపోయిందెవరు? క్షుద్ర పూజలు చేయించిందెవరు? అంటూ ప్రశ్నించారు. 40 గుడులను కూల్చేసింది ఎవరు? సదావర్తి భూముల్ని పప్పుబెల్లాలకు అమ్మేసిందెవరు? అంతర్వేది రథం తగలబెట్టిందెవరు? రాముడి విగ్రహం విరిచేసిందెవరు? నీ కొడుకు మీద ప్రమాణం చేసి నిజాలు చెప్పు అంటూ మంత్రి రోజా ఆ ట్వీట్ లో ప్రశ్నించారు. తిరుమల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్ సంప్రదాయ రీతిలో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్నారు. తొలి రోజున బ్రహోత్సవాల్లో పాల్గొన్నారు. సీఎం తిరుమల పర్యటనలో జిల్లా మంత్రిగా రోజా హాజరయ్యారు.

తిరుమలలో సీఎం జగన్ బస
రాత్రి అక్కడే బస చేసిన సీఎం జగన్ ఈ రోజు మరోసారి శ్రీవారి పర్యటన తరువాత నంద్యాల వెళ్లనున్నారు. ఇక, సాయంత్రం పార్టీ సమన్వయకర్తలు - నేతలతో ఇంటింటికి ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎన్టీఆర్ పేరు మార్పు వివాదం కొనసాగుతన్న సమయంలోనే లోకేశ్ చేసిన ట్వీట్ రాజకీయంగా చర్చకు కారనమైంది. దీనికి స్పందనగా టీడీపీ హయాంలో వైసీపీ చేసిన ఆరోపణలు..వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత చోటు చేసుకున్న అంశాల పైన స్పందిస్తూ లోకేశ్ ను నిలదీస్తూ ట్వీట్ చేసారు. దీని పైన ఇప్పటి వరకు టీడీపీ నేతలు స్పందించలేదు. అటు ఎన్టీఆర్ పేరు మార్పు వ్యవహారరం పైన వివాదం కొనసాగుతూనే ఉంది.












Click it and Unblock the Notifications