నెల్లూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సోమిరెడ్డి సీటు ఖరారైందట...టిడిపి ఫస్ట్ లిస్ట్ లోనే పేరు!:పోటీ ఎక్కడంటే?

By Suvarnaraju
|
Google Oneindia TeluguNews

నెల్లూరు:అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఏ పార్టీ కైనా తలనొప్పులు తెచ్చే కార్యక్రమమే...ఒకరి పేరు ప్రకటించాక మరొకరి నుంచి అలకలు...అభ్యంతరాలు...వార్నింగ్ లు...కారణం సీటు ఒక్కటుంటే ఆశావాహుల సంఖ్య చాలా ఎక్కువగా ఉండటమే!...కానీ ఈ ప్రక్రియ అనివార్యం...జరిపి తీరేదే.

ఈ క్రమంలో చాలా స్థానాల్లో చివరినిమిషం వరకు అభ్యర్థి పేరు ఖరారు కాదు...కొన్ని చోట్ల ముందే ఖరారైనా చివరి క్షణాల్లో మారిపోతూ ఉంటాయి. అందుకే ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి చాలా ముందే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసుకోవడమంటే ఎంతో భాగ్యశాలి కింద లెక్క...ఈసారి టిడిపి తరుపున అలాంటి అదృష్టవంతుల జాబితాలో మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేరు ఉండబోతోందట...వివరాల్లోకి వెళితే...

 టిడిపి...ముందస్తు కసరత్తు

టిడిపి...ముందస్తు కసరత్తు

పలు స్థానాలకు చివరి నిమిషంలోనే అభ్యర్థుల పేర్లు వెల్లడించడం టిడిపి అధినేత చంద్రబాబు తంత్రాల్లో ఒకటి. అయితే ఈసారి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు గానూ కొన్ని స్థానాల్లో అభ్యర్థులను ముందే ప్రకటించాలని తెలుగుదేశం అధిష్ఠానం కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నెల్లూరు జిల్లాపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని వినికిడి. అందుకు కారణం ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో కాస్త ముందుగా అభ్యర్థులను ప్రకటిస్తే ఆ నియోజకవర్గాలపై పట్టు సాధించడానికి వీలుంటుందని అక్కడి టీడీపీ నేతలు అధిష్ఠానానికి విన్నవించారట. అలా అయితే ఈ జిల్లా నుంచి ముందస్తుగా ఖరారు కాబోయే అభ్యర్థులు ఎవరనే విషయం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

అలాంటి అన్నిచోట్లా...పేర్లు ఖరారు!

అలాంటి అన్నిచోట్లా...పేర్లు ఖరారు!

దీంతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిత్యం వహిస్తున్న అన్నిచోట్లా అభ్యర్థుల పేర్లు ముందుగానే ఖరారు చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. ఆ క్రమంలో తొలివిడతగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న 40 స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను ముందే ప్రక టించాలని భావిస్తున్నారట. ఈ క్రమంలో టిడిపి తొలి జాబితాలో నెల్లూరు జిల్లా నుంచి కొందరి పేర్లు వెలువడే అవకాశం ఉందని పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

తొలి జాబితాలో...సోమిరెడ్డి పేరు?

తొలి జాబితాలో...సోమిరెడ్డి పేరు?

నెల్లూరు జిల్లాలో ప్రతిపక్ష ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న సర్వేపల్లె నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి విషయమై పార్టీ అధిష్టానం పూర్తి స్పష్టతతో ఉందంటున్నారు. మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేయడానికి సుముఖంగా ఉండగా...ఈ విషయమై పార్టీ అధినేత చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారట. గత ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు నుంచే ఈ నియోజకవర్గంలో మంత్రి సోమిరెడ్డి, ఆయన కుమారుడు విస్తృతంగా పర్యటిస్తూ తమ పట్టు పెంచుకునేలా తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ క్రమంలో టిడిపి ముందస్తు అభ్యర్థుల జాబితాలో మంత్రి సోమిరెడ్డి పేరు...ఈ నియోజకవర్గానికి ఖరారు చేస్తూ ఉండటం ఖాయమంటున్నారు.

ఆత్మకూరు:ఇన్ ఛార్జే... అభ్యర్థి!

ఆత్మకూరు:ఇన్ ఛార్జే... అభ్యర్థి!

ఇక ఆ తరువాత ఆత్మకూరుకు కూడా త్వరలోనే అభ్యర్థిని ఖరారు చేయనున్నారట. వచ్చే ఎన్నికల్లో ఈ నియోజకవర్గంలో ఎలాగైనా విజయం సాధించాలని టిడిపి పట్టుదలతో ఉంది. కారణం ఇక్కడ ఆనం రామనారాయణరెడ్డి నిష్క్రమణతో నియోజకవర్గంలో నాయకత్వం సమస్య తలెత్తడమే. ఆ లోటును భర్తీ చేయడంపై టిడిపి అధిష్ఠానం సీరియస్ గా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇక్కడకు గట్టి నాయకుడిని తీసుకురావాలనే ఉద్దేశంతోనే నియోజకవర్గ ఇన్‌చార్జి నియామకాన్ని కూడా వాయిదా వేశారని చెప్పుకుంటున్నారు. ఇక్కడ అభ్యర్థిగా ఎవరైతే ఉండబోతున్నారో వారినే ఇన్‌చార్జిగా ప్రకటించాలని అధిష్ఠానం నిర్ణయించుకుందట. కొద్ది రోజుల వ్యవధిలో ఆత్మకూరు ఇన్‌చార్జి ప్రకటన జరిగే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అలా ఆత్మకూరు అభ్యర్థి పేరు కూడా ముందస్తు జాబితాలో ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

సిటీ, రూరల్‌ అభ్యర్థులు...ఆలస్యం కావచ్చు

సిటీ, రూరల్‌ అభ్యర్థులు...ఆలస్యం కావచ్చు

ఇక నెల్లూరు సిటీ, రూరల్‌ అభ్యర్థుల పేర్లను ఆలస్యంగానే ప్రకటిచే అవకాశాలు ఉన్నాయని...అందుకు స్థానికంగా ఇక్కడ నెలకొని ఉన్న ప్రత్యేక పరిస్థితులే కారణమని తెలుస్తోంది. అసలు మంత్రి నారాయణ ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తారా...లేదా?...అనే విషయాన్ని బట్టే ఈ రెండు నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఖరారు ఆధారపడి ఉంటుందనేది వాస్తవం. వచ్చే ఎన్నికల్లో మంత్రి నారాయణను నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం జిల్లాల ఇన్‌చార్జిగా నియమించి మెజారిటీ స్థానాల గెలుపు కోసం వాడుకోవాలని టిడిపి అధిష్ఠానం యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఇదంతా తనను పోటీ నుంచి పక్కకు తప్పించాలని కొందరి ఆలోచనగా భావిస్తున్న మంత్రి నారాయణ...తాను పోటీ చేయాల్సిందేనని గట్టిగా పట్టుపడితే అధిష్ఠానం ఆయన అభిష్టాన్ని తోసిపుచ్చే అవకాశం ఉండదని అంటున్నారు. ఈక్రమంలో మంత్రి నారాయణ నిర్ణయం తీసుకునేందుకు వీలుగా ఇక్కడ అభ్యర్థుల పేర్లు ఆలస్యం కావచ్చని భావిస్తున్నారు.

English summary
Nellore:TDP prepare to announce the names of the MLA candidates who will contest in next election where opposition party MLA Representing. The TDP leaders are saying that Minister Somireddy Chandra mohan Reddy name is guarantee in that first list .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X