పదవులకోసం పాకులాడం: ఆనం వివేకాకు మంత్రి సోమిరెడ్డి బుజ్జగింపు
ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ఆనం వివేకానందతో సమావేశమయ్యారు.ఆనం వివేకానందను బుజ్జగించారు.న్యాయం చేస్తామని మంత్రి సోమిరెడ్డి ఆనం వివేకానందకు హమీ ఇచ్చారు.
నెల్లూరు:ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదివారం నాడు ఆనం వివేకానందతో సమావేశమయ్యారు.ఆనం వివేకానందను బుజ్జగించారు.న్యాయం చేస్తామని మంత్రి సోమిరెడ్డి ఆనం వివేకానందకు హమీ ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీని వీడి టిడిపిలో చేరారు ఆనం సోదరులు. అయితే టిడిపిలో చేరే సమయంలో ఆనం సోదరులకు ఇచ్చిన హమీని టిడిపి నాయకత్వం అమలు చేయలేదనే అసంతృప్తి ఆనం సోదరుల్లో ఉంది.
అయితే ఆనం వివేకానందరెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తామనే హమీని టిడిపి నెరవేర్చలేదు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన తర్వాత ఆనం సోదరులిద్దరూ కూడ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.
పార్టీ తీరుపై అసంతృప్తిగా ఉన్నఆనం సోదరులను తృప్తి పర్చేందుకుగాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వారిని కలుసుకొన్నారు. ఆనం వివేకానందరెడ్డి సుదీర్ఘంగా చర్చించారు.

ఆనం వివేకాను బుజ్జగించిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి
ఆనం వివేకానందరెడ్డిని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కలిశారు. సమారు గంటకు పైగా వివేకానందరెడ్డితో చర్చించారు. పార్టీ తనకు అన్యాయంచేసిందనే విషయాన్ని వివేకా మంత్రి దృష్టికి తెచ్చారు.అయితే ఈ విషయాన్ని అధినేత దృష్టికి తీసుకెళ్ళనున్నట్టు మంత్రి చెప్పారు.ఆనం సోదరులకు న్యాయం చేస్తానని హమీ ఇచ్చారు మంత్రి సోమిరెడ్డి.పార్టీని వదిలి వెళ్ళే పరిస్థితి లేదని వారు సోమిరెడ్డికి చెప్పారు. పదవుల కోసం తాము పాకులాడబోమని మంత్రికి ఆనం వివేకా చెప్పారు.

సోమిరెడ్డికి స్వాగత కార్యక్రమంలో పాల్గొనని ఆనం సోదరులు
ఎమ్మెల్సీ పదవి దక్కకపోవడంతో ఆనం సోదరులు అసంతృప్తిగా ఉన్నారు.అయితే మంత్రి పదవి వచ్చిన తర్వాత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తొలిసారిగా జిల్లా పర్యటనకు వచ్చారు.అయితే పార్టీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద ఎత్తున నెల్లూరులో మంత్రికి స్వాగతం పలికారు.అయితే ఈ కార్యక్రమంలో ఆనం సోదరులు మాత్రం పాల్గొనలేదు. దీంతో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆనం వివేకాను కలిసి చర్చించారు.

ఆనం సోదరులను కలుపుకుపోని టిడిపి నాయకత్వం
ఆనం సోదరులను టిడిపి జిల్లా నాయకత్వం కలుపుకుపోవడం లేదు. అయితే ఎమ్మెల్సీ పదవి దక్కని కారణంగా ఆనం సోదరులు అసంతృప్తిగా ఉన్నారు.అయితే వారితో చర్చించలేదు పార్టీ జిల్లా నాయకత్వం. కూడ ఆనం సోదరులతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరించింది.

మంత్రి నారాయణతో ఆనం వివేకా చర్చలు
మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి చర్చించిన తర్వాత ఆనం వివేకానందరెడ్డి మంత్రి నారాయణను కలిశారు. మంత్రి నారాయణతో ఆనం వివేకానంద రెడ్డి సుమారు అరగంటపాటు చర్చించారు. మంత్రి నారాయణతో ఆనం వివేకానంద చర్చించడం చర్చనీయాంశమైంది.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..! -
కొత్త సినిమాలపై పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం, ఇక నుంచి..!! -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
టీడీపీ కంచుకోటలో వైసీపీ అభ్యర్ధి ఫిక్స్, 2024 నిర్ణయాల దిద్దుబాటు..!! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
వెండి విలయ తాండవం: నిలిచిపోయిన ట్రేడింగ్! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!!












Click it and Unblock the Notifications