'ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రత్యేకస్థానం, ప్రపంచంలో ఎక్కడ జరిగినా ఈ పేరు'

Posted By:
Subscribe to Oneindia Telugu
  YS Jagan Padayatra : ఆర్థిక నేరాల్లో ప్రత్యేకస్థానం, చరిత్ర సృష్టిస్తారా | Oneindia Telugu

  అమరావతి: పారడైజ్ పేపర్స్ ద్వారా మరోసారి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి అవినీతి బయటపడిందని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.

  కలకలం: పాదయాత్ర టైంలో వైసీపీకి భారీ షాక్, పారడైజ్ పేపర్స్‌లో జగన్ పేరు

   ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం

  ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం

  ఆర్థిక నేరాల్లో జగన్‌కు ప్రత్యేక స్థానం ఉందని యనమల ఎద్దేవా చేశారు. ఆర్థిక నేరస్తుడు, పన్ను ఎగవేతదారు అయిన జగన్ పాదయాత్ర చేయడం హాస్యాస్పదం అన్నారు.

   జగన్ చరిత్ర ప్రపంచానికి తెలిసింది

  జగన్ చరిత్ర ప్రపంచానికి తెలిసింది

  పారడైజ్ పేపర్ల ద్వారా జగన్ చరిత్ర ప్రపంచానికి తెలిసిందని యనమల మండిపడ్డారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే జగన్ పాదయాత్ర చేస్తున్నారని చెప్పారు. జగన్ ఆఫ్ షోర్ లావాదేవీలపై సీబీఐ దర్యాఫ్తు చేయాలన్నారు.

  ఢిల్లీ వెళ్లి కేంద్రం కాళ్లు పట్టుకుంటాడు

  ఢిల్లీ వెళ్లి కేంద్రం కాళ్లు పట్టుకుంటాడు

  జగన్ ప్రత్యేక హోదాపై మాట్లాడుతారని, ఢిల్లీ వెళ్లి కేంద్రం పెద్దల కాళ్లు పట్టుకుంటారని, కానీ హోదా ఇవ్వాల్సింది చంద్రబాబు కాదన్న విషయం ఆయనకు తెలియదా? అని మంత్రి సోమిరెడ్డి వేరుగా మండిపడ్డారు.

  ప్రపంచంలో ఏ మూల ఆర్థిక నేరమైనా జగన్ పేరు

  ప్రపంచంలో ఏ మూల ఆర్థిక నేరమైనా జగన్ పేరు

  ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న ప్యారడైజ్‌ పేపర్స్‌లో జగన్‌ పేరుండటం అతని అవినీతికి పరాకాష్ట అని సోమిరెడ్డి అన్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ ఆర్థిక నేరం జరిగినా అందులో జగన్‌ పాత్ర ఉండడం సర్వసాధారణమైందని, అవినీతిలో నిండా మునిగిన జగన్‌ చంద్రబాబుపై ఎలా విమర్శలు చేస్తారని ప్రశ్నించారు.

   వాడు, వీడు అంటారా

  వాడు, వీడు అంటారా

  నంద్యాల ఉప ఎన్నికల్లో జగన్‌ వ్యాఖ్యలను ఈసీ తప్పుబట్టిందని, అభ్యంతరకర వ్యాఖ్యలపై కేసు నమోదైనా జగన్‌ తీరు మారలేదని, సీఎం చంద్రబాబును వాడు, వీడు అంటూ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.

  రాజన్న పాలన అంటే

  రాజన్న పాలన అంటే

  తనను గెలిపిస్తే రాజన్న పాలన తీసుకొస్తానని జగన్‌ చెబుతున్నారని, వేల ఎకరాల పేదల భూములను సెజ్‌ల పేరుతో లాక్కొని రైతులను నట్టేట ముంచడమేనా రాజన్న పాలన?, ప్రభుత్వ ఆస్తులను అనుచరులకు తెగనమ్ముకోవడమేనా రాజన్న పాలన? గోదావరి జిల్లాల్లో క్రాప్‌ హాలీడే ప్రకటించే దుర్భిక్ష పరిస్థితులు తీసుకురావడమేనా రాజన్న పాలనా అని మంత్రి కాల్వ శ్రీనివాసులు నిలదీశారు.

   జగన్ పాదయాత్ర ఓ జగన్నాటకం

  జగన్ పాదయాత్ర ఓ జగన్నాటకం

  ఎన్నికలకు ముందే జైలుకి వెళ్తానేమోనన్న భయంతో జగన్‌ పాదయాత్ర నాటకానికి తెరతీశారని మంత్రి మండిపడ్డారు. పాదయాత్ర పేరుతో అరాచకాలు సృష్టించాలని ప్రయత్నిస్తే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదన్నారు. జగన్‌ పాదయాత్ర ఓ జగన్నాటకమని మంత్రి కొల్లు రవీంద్ర విమర్శించారు.

  ఇంకా వివాహం చేసుకోలేదా? తెలుగు మ్యాట్రిమోనిలో నేడే రిజిస్టర్ చేసుకోండి - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Ministers lashed out at YSR Congress Party chief YS Jaganmohan Reddy for his Praja Sanklpa Padayatra.

  Oneindia బ్రేకింగ్ న్యూస్
  రోజంతా తాజా వార్తలను పొందండి