షర్మిలతోనే రాజకీయ ప్రయాణం - జగన్, రేవంత్ పై ఆర్కే సంచలన వ్యాఖ్యలు..!!
ఎన్నికల వేళ ఏపీ రాజకీయం అనూహ్యంగా మారుతోంది. వైసీపీ సీట్ల ఖరారు వేళ కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. సీట్లు దక్కని కొందరు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ కు విధేయుడుగా గుర్తింపు ఉన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే సంచలన వ్యాఖ్యలు చేసారు. ఇప్పటికే పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆర్కే రాజీనామా చేసారు. తన భవిష్యత్ రాజకీయంతో పాటుగా కేసుల విషయంలోనూ ఆర్కే తన వైఖరి తేల్చి చెప్పారు.
ఆర్కే కీలక వ్యాఖ్యలు: మంగళగిరి ఎమ్మెల్యే మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆర్కే ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో లోకేష్ పైన గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చినా జగన్ అమలు చేయలేదు. మంగళగిరి నుంచి ఈ సారి ఎన్నికల్లో బీసీ వర్గానికి చెందిన గంజి చిరంజీవిని సీఎం జగన్ అభ్యర్దిగా ఖరారు చేసారు.

ఈ ప్రకటన సమయంలోనే ఆర్కే పార్టీకి..ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసారు. ఆర్కే కుటుంబం మాత్రం వైసీపీలోనే కొనసాగుతోంది. ఇక, ఇప్పుడు ఆర్కే తాను రాజకీయంగా షర్మిలతో కొనసాగుతానని ప్రకటించారు. షర్మిల తన రాజకీయ నిర్ణయం ప్రకటించిన తరువాత ఆమెతోనే కలిసి నడుస్తానని తేల్చి చెప్పారు.
షర్మిలతోనే రాజకీయ ప్రయాణం: మంగళగిరి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి 1200 కోట్లు కేటాయిస్తే అందరం సంతోషించామని చెప్పారు. కానీ, కరోనా ఇబ్బందుల కారణంగా నిధుల కోసం ఒత్తిడి చేయలేదన్నారు. ఆ తరువాత ఆ మొత్తాన్ని రూ 500 కోట్లకు కుదించారని..తరువాత మరోసారి 300 కోట్లకు తగ్గించి..చివరకు 125 కోట్లుగా ఖరారు చేసారని వివరించారు.
మంగళగిరి నియోజకవర్గానికి ఈ రోజు వరకు ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. వైసీపీకి తాను ఎంత సేవ చేసినా..జగన్ తనను గుర్తించ లేదని వాపోయారు. తనకు టికెట్ ఇవ్వలేదని పార్టీ వీడలేదన్నారు. తాను లేకపోయినా మంగళగిరి అభివృద్ధి ఆగదన్నారు. తనకు చిరంజీవి ,జగన్ మధ్య ఏమి జరిగింది అనేది మా అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు.
వైఎస్ జగన్ సర్కారుపై వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు..!!#AllaRamakrishnaReddy #RK #MangalagiriMLA #YSJagan #YSJaganGovt #YSJaganRegime #YSRCPGovt #YSJaganGovt #AndhraPradesh #Oneindiatelugu pic.twitter.com/eB79LM2Tw1
— oneindiatelugu (@oneindiatelugu) December 30, 2023
చేయాల్సింది చేయలేదు: చంద్రబాబుపై వేసిన కేసులపై న్యాయ పోరాటం చేస్తానని ఆర్కే స్పష్టం చేసారు. ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో కూడా కేసును వెనక్కి తీసుకొనని చెప్పుకొచ్చారు. రేవంత్ కాంగ్రెస్ లో ఉన్నా.. షర్మిల కాంగ్రెస్ లోకి వచ్చినా తన పోరాటం ఆగదన్నారు. సీఎం అయితే రేవంత్ రెడ్డి ఏమైనా గొప్పా అని ప్రశ్నించారు. తప్పు ఎవ్వరూ చేసినా తప్పేనని వ్యాఖ్యానించారు.
వైసీపీ ప్రభుత్వం తప్పు చేస్తే వాటిపై కేసులు వేసేందుకు అయినా వెనకాడనని కీలక వ్యాఖ్యలు చేసారు. తప్పులు ఎవరు చేశారు అనేది న్యాయ స్థానాలు తెలుస్తాయని ఆర్కే పేర్కొన్నారు. మంగళగిరి, కుప్పం, గాజువాక, భీమవరం లాంటి నియోజకవర్గాల్లో వైసిపి గెలవాలి అంటే ఆ నియోజకవర్గాల్లో ఎంతో అభివృద్ధి చేయాలో అంత చేయలేదని..ఎలా గెలిపిస్తారని ఆర్కే ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications