మంత్రి పరిటాల సునీత కారు నడిపిన ఎమ్మెల్యే

 MLA drives Paritala Sunitha's car
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత కారును అనంతపురం ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్‌ చౌదరి గురువారం నడిపారు. వైద్య కళాశాలలో వైద్యశాఖ సమీక్ష అనంతరం సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రి స్థల పరిశీలన కోసం మంత్రులు జేఎన్‌టీయూ సమీపానికి బయలుదేరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి మంత్రి పరిటాల సునీత బుగ్గకారును నడిపారు.

రాజధాని నిర్మాణానికి 1.5లక్షల కోట్లు ఇవ్వాలి: మధు

నవ్యాంధ్రప్రదేశ్‌ రాజధానికి కేంద్రం లక్షా 50 వేల కోట్లు మంజూరు చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పెనుబల్లి మధు డిమాండ్‌ చేశారు. గురువారం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. కేంద్రం మంజూరు చేస్తామన్న రూ.5 వేల కోట్లు ఏ పాటికి చాలవన్నారు.

మౌలిక సదుపాయాల్లో ప్రైవేట్‌ భాగస్వామ్యాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కేంద్రం నుంచి నిధులు రాబట్టడంలో ఇటు టీడీపీ ప్రభుత్వంతోపాటు అటు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కూడా విఫలమయ్యారన్నారు. సామాజిక అక్షరాస్యతకు మరో 10 వేల కోట్లు కేంద్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

కేసీఆర్‍ తెలంగాణలోమీడియాను పాతరేస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్‌లో పలు జిల్లాల్లో గురువారం కూడా జర్నలిస్టులు పలురూపాల్లో తీవ్ర నిరసనలు వ్యక్తం అయ్యాయి. పలుచోట్ల జర్నలిస్టులు, వివిధ పార్టీల వారు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+