ఎన్టీఆర్ నిర్ణయానికి ఎదురెళ్లిన బాబు!.. ఎమ్మెల్యే గద్దె పోరాటంతో వెనక్కి తగ్గి..
: కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన రోడ్ల విస్తరణ మరియు సుందరీకరణ పనుల్లో భాగంగా.. విజయవాడ నగరంలోని పలు హిందూ దేవాలయాలను, మసీదులను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి.
అయితే తొలగించిన ఆలయాలకు ప్రభుత్వం వేరే దగ్గర స్థలం కేటాయిస్తుందని ప్రభుత్వం హామి ఇవ్వడంతో వివాదానికి తెరపడింది. ఇక ఇదే పుష్కరాల పనుల్లో భాగంగా.. పద్మావతి ఘాట్ చివర్లో ఉన్న కృష్ణలంక వాసులను ఖాళీ చేయించడానికి ప్రయత్నించింది ప్రభుత్వం. స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కు కూడా కనీస సమాచారం లేకుండా.. ఈ చర్యకు ఒడిగట్టడంతో.. స్థానికంగా ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది.
పద్మావతి ఘాట్ ను విస్తరించి.. అక్కడ ఓ పార్కును ఏర్పాటు చేయాలన్న ప్లాన్ లో భాగంగా.. కార్పోరేషన్ అధికారులు కృష్ణలంక వాసులను ఖాళీ చేయించడానికి యత్నించారు. రాత్రికే రాత్రే ప్రొక్లెయినర్లతో అక్కడ వాలిపోవడంతో.. స్థానికులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేశారు. ఇక ఈ విషయంపై ఎమ్మెల్యే గద్దె గట్టిగానే పోరాడారు. విషయాన్ని చంద్రబాబు దాకా తీసుకెళ్లి.. కార్పోరేషన్ అధికారుల దూకుడుకు బ్రేకులు వేయించారు.

ఇక్కడ గమనించాల్సిన మరో విషయమేంటంటే... ఆనాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో కృష్ణలంకలో నివాసాలు ఏర్పరుచుకున్న స్థానికులకు పట్టాలు మంజూరు చేశారు. దీంతో చాలామంది అక్కడ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. పుష్కరాల సందర్బంగా.. ఆ ఇళ్లను కూల్చివేసి స్థానికులను ఖాళీ చేయించాలన్న చర్యతో ఎన్టీఆర్ తీసుకున్న నిర్ణయానికి చంద్రబాబు ప్రభుత్వం ఎదురెళ్లినట్టయింది.
ఇంకా వీడని భయాందోళనలు :
ఇదంతా ఇలా ఉంటే.. ఇప్పటికీ అక్కడి స్థానికుల్లో భయాందోళనలు మాత్రం అలానే ఉన్నాయి. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్వయంగా వెల్లడించారు. టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో భాగంగా.. ఈ అంశాన్ని లేవనెత్తారు గద్దె. కూల్చివేతలకు సిద్దమై.. ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు వెనక్కి తగ్గిన ప్రభుత్వం.. భవిష్యత్తులో మళ్లీ ఎక్కడ కూల్చివేతలకు పాల్పడుతుందోనన్న భయం స్థానికుల్లో నాటుకుపోయిందని గద్దె వివరించారు.
దాదాపు ఇరవై వేల ఓటు బ్యాంకు కలిగిన కృష్ణలంక ప్రజలను ఇలా భయాందోళనకు గురిచేస్తే.. భవిష్యత్తులో టీడీపీకి ఆ దెబ్బ తప్పదు అన్న విషయాన్ని ఆయన పరోక్షంగా గుర్తుచేశారు. దీంతో వెంటనే నష్ట నివారణ చర్యలకు దిగింది ప్రభుత్వం. స్వయంగా చంద్రబాబే అక్కడి స్థానికులను పరామర్శించి.. కూల్చివేతలపై ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని చెప్పడం ద్వారా.. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కాలని భావిస్తోంది.
m.s:కృష్ణా పుష్కరాల కోసం చేపట్టిన రోడ్ల విస్తరణ మరియు సుందరీకరణ పనుల్లో భాగంగా.. విజయవాడ నగరంలోని పలు హిందూ దేవాలయాలను, మసీదులను అధికారులు కూల్చివేసిన సంగతి తెలిసిందే. దీనిపై పలువురు పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ లాంటి సంస్థలు చంద్రబాబు ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశాయి.
-
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ












Click it and Unblock the Notifications