సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన...గిడ్డి ఈశ్వరి ఫ్యామిలీ ఫైటింగ్ వీడియో!

Recommended Video

    సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన గిడ్డి ఈశ్వరి ఫైటింగ్ వీడియో!

    విశాఖపట్టణం:ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తమ కుటుంబ సభ్యురాలితో ఘర్షణ పడుతూ దెబ్బలాటకు దిగిన వీడియో క్లిప్పింగ్‌ ఆదివారం సోషల్‌ మీడియాలో ప్రత్యక్షమై ఆ తరువాత వైరల్‌ గా మారింది. వివరాల్లోకి వెళితే...

    పాడేరు ఎమ్మెల్యే ఈశ్వరి తన స్వగ్రామం కుమ్మరిపుట్టులో తన వదిన వద్దే రూ. 2 లక్షలకు వారికి చెందిన భూమిని కొనుగోలు చేసి ఇంటి నిర్మాణానికి పనులు చేపట్టారు. అయితే ధాన్యం నిల్వల కోసం గౌడౌన్ నిర్మించే క్రమంలో ఎమ్మెల్యే ఈశ్వరి, ఆమె వదిన విజయలక్ష్మిల మధ్య ఆదివారం ఉదయం వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో వారివురూ తోసుకొని కిందపడి పోయారు.

    MLA Giddi Eswari family fight video goes viral in Social Media

    తర్వాత ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి, తన వదిన విజయలక్ష్మితో గౌడౌన్ నిర్మాణం విషయమై వాదిస్తున్నారు. 28 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో క్లిప్పింగ్‌ వాట్సాప్‌ గ్రూప్‌లు, ఫేస్‌బుక్‌ వంటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఈ వీడియో గురించి ఎమ్మెల్యే ఈశ్వరి వద్ద ప్రస్తావించగా...మ కుటుంబ వ్యవహారాన్ని ఇలా సోషల్‌ మీడియాలో పెట్టడం తగదని ఆమె తప్పుబట్టారు.

    అయితే ఈ వీడియోని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరీ ప్రత్యర్థులే సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అది విస్తరించేందుకు ప్రయత్నం చేశారని గిడ్డి ఈశ్వరీ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. అయితే ఆమె వ్యతిరేకులు మాత్రం ఆ వీడియోను కావాలనే గిడ్డి ఈశ్వరీ షూట్ చేయించారని, ఈ స్థల వివాదంలో పైచేయి సాధించేందుకు అవసరమైతే తనతో గొడవపడిన కుటుంబ సభ్యురాలిపై పోలీస్ కేస్ పెట్టేందుకు ఈ వీడియోను వాడుకోవాలనే ప్లాన్ తో ఆమె ఈ విధంగా చేసారని ఆరోపిస్తున్నారు.

    ఆ వీడియోలో ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరినే తన వదినపై దౌర్జన్యం చేస్తూ నన్ను కొట్టకు...నన్ను కొట్టకు అంటూ ఆమె దాడి చేస్తున్నట్లుగా చిత్రించే ప్రయత్నం చేశారని...అక్కడ ఉన్న ఒక వ్యక్తి కూడా అదే విషయం ఫోన్ లో చెబుతున్నాడని...ఆ విషయం వీడియోను జాగ్రత్తగా పరిశీలిస్తే తెలిసిపోతుందని ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఒకసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారితే ఆ వీడియోను కంట్రోల్ చేయడం ఎంత కష్టమో గిడ్డి ఈశ్వరీ కుటుంబ తగాదా వీడియో ద్వారా తేటతెల్లమైపోతోంది.

    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+