మంత్రిని -నన్ను అంతం చేసేందుకే : రాజకీయాలు వదిలేద్దామని -వైసీపీ ఎమ్మెల్యే సంచలనం..!!

అధికార వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేసారు. కోనసీమ జిల్లా పేరు విషయంలో చోటు చేసుకున్న పరిణామాలు.. విధ్వంసం తరువాత ప్రభుత్వం అధికారికంగా పేరు పైన నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ముందుగా ప్రతిపాదించిన విధంగా కోనసీమ జిల్లాకు అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఖరారు చేసింది. నెల రోజుల పాటు జిల్లా ప్రజల నుంచి అభిప్రాయాలు..సూచనలు స్వీకరించిన జిల్లా కలెక్టర్ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ రిపోర్టు ఆధారంగా కేబినెట్ లో ఈ అంశం పైన చర్చించి అంబేద్కర్ పేరు ఖరారు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు ప్రతిపాదించిన సమయంలో అమలాపురం కేంద్రంగా మొదలైన నిరసనలు ఒక్క సారిగా విధ్వంసానికి దారి తీసింది. మంత్రి విశ్వరూప్ ..ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ నివాసాలకు నిప్పు పెట్టారు. బస్సులు ధ్వంసం చేసారు. ఆ తరువాత పోలీసు ఉన్నతాధికారులు అక్కడే మకాం వేసి..విధ్వంసానికి కారకులను గుర్తించి అరెస్ట్ చేసారు. దీని పైన రాజకీయంగానూ పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. ఇక, ఇప్పుడు నాటి విధ్వసంలో తన ఇంటిని తగలబెట్టటం పైన ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ స్పందించారు. అమలాపురంలో జరిగిన పార్టీ ప్లీనరీలో ఆయన దీని పైన వ్యాఖ్యలు చేసారు.

MLA ponnada Satish Response over his house set ablaze by protesters in Amalpauram Violence

తనను..తన భార్యను ఇంట్లో పెట్టి తగలబెట్టే ప్రయత్నం చేసారని ఆవేదన వ్యక్తం చేసారు. ఆ సమయంలోనే తాను రాజకీయాలను వదిలేద్దామని అనుకున్నానని చెప్పుకొచ్చారు. మంత్రితో పాటుగా తనను అంతమొందించేందుకు దృష్టశక్తులు, కొందరు వ్యక్తులు హింసాత్మక చర్యలకు పాల్పడ్డారంటూ ఆగ్రహం వ్యక్తం చేసారు. అంబేద్కర్ పేరు పెడితే ఎందుకు బాధ వచ్చిందో ఒక సారి ఆలోచన చేయాలని ఎమ్మెల్యే సూచించారు. అమలాపురంలో జరిగిన పరిణామాలు.. చోటు చేసుకున్న విధ్వంసం - అల్లర్లతో కోనసీమ అభివృద్ధి పదేళ్లు వెనక్కి వెళ్ళిందని సతీష్ ఆవేదన వ్యక్తం చేసారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+