సీఎం స్టాలిన్ కు రోజా జబర్ధస్త్ గిఫ్ట్ - అభ్యర్ధనలు : ముఖ్యమంత్రి ఏమన్నారంటే..!!

వైసీపీ ఎమ్మెల్యే రోజా - సెల్వమణి దంపతులు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో సమావేశమయ్యారు. చెన్నైలో సీఎం కార్యాలయంలో వారు స్టాలిన్ ను కలిసి పలు అభ్యర్ధనలు అందించారు. అదే సమయంలో రాయలసీమ వీవర్స్ స్టాలిన్ బొమ్మతో తయారు చేసిన శాలువాలను రోజా - సెల్వమణి సీఎం కు బహూకరించారు. ఈ భేటీలో నగిరి నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలతో పాటు ఏపీలో నివసిస్తున్న తమిళుల సమస్యలను ప్రస్తావించారు.

ఆంధ్రప్రదేశ్ లో ఉండి తమిళ మీడియంలో చదువుతున్న విద్యార్థులకు తమిళ పాఠ్యపుస్తకాలు (మెట్రిక్యులేషన్ సిలబస్ ) ఒకటో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఒక్కొక్క తరగతి కు 1000 చొప్పున మంజూరు చేయాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ద్వారా సుమారు 5 వేల ఎనిమిది వందల ఎకరాల విస్తీర్ణంలో చేపడుతున్న కొసలనగరం పారిశ్రామిక పార్క్ నకు తమిళనాడు నుంచి పరిశ్రమలు రావడానికి,భారీ వాహనాల ట్రాన్స్పోర్టేషన్ రాకపోకలకు అనువుగా నేడుంబరం - అరక్కోణం రోడ్డు జాతీయ రహదారి 716 నుంచి ఇండస్ట్రియల్ పార్కు చేరడానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని కోరుతూ ప్రతిపాదనలు సమర్పించారు.

MLA Roja met Tamilanadu CM Stalin on many common issues belongs to tamilanadu native who living in Chittoor dist

ఆంధ్ర తమిళనాడు రాష్ట్రాలలో హ్యాండ్లూమ్ మరియు పవర్లూమ్ కార్మికులు ఒక కోటికి పైగా ఉన్నారని కరోనా తర్వాత చేనేత మరమగ్గాల కార్మికులకు ఉపాధి కల్పించడం ద్వారా ప్రపంచ దేశాల అవసరాలను తీర్చడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ సరిహద్దు ప్రాంతాలలో నివాసముంటున్న తమిళ కుటుంబీకులు చెన్నై మహానగరం తోనూ తమిళనాడులోని ప్రధాన పట్టణాల్లోనూ బంధుత్వ పరంగా అయినా, వ్యాపారపరంగా అయినా చాలా ఎక్కువ లావాదేవీలు కలిగి ఉన్నారని, అటువంటి వారికి తమిళనాడులో జనరల్ హాస్పిటల్స్ లో తమిళ నాడు ప్రభుత్వ పౌరుడుకు ఉన్న సౌకర్యాలు అన్నింటిని కూడా చిత్తూరు నెల్లూరు జిల్లాలో ఉన్న తమిళ కుటుంబీకులకు కూడా వర్తింపజేయాలని విన్నవించారు. వీటి పైన సీఎం స్టాలిన్ సానుకూలంగా స్పందించారు. పరిశీలించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటామని రోజా - సెల్వమణికి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+