ప్రమాదంలో గాయపడిన మహిళను ఆసుపత్రిలో చేర్చిన ఎంఎల్ఏ రోజా

తిరుపతి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ మహిళను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంఏల్ఏ, సినీ నటి రోజా కాపాడారు. ఈ ఘటన శుక్రవారం నాడు నేండ్రగుంట వద్ద చోటుచేసుకొంది. ప్రమాదానికి గురైన మహిళ కుటుంబసభ్యులు ఎంఏల్ఏ రోజాకు ధన్యవాదాలు తెలిపారు.

చిత్తూరు జిల్లా పాకాల మండలంలోని నేండ్రగుంట వద్ద సింధు అనే మహిళ ప్రమాదవశాత్తు స్కూటీ పై నుండి కిందపడి తీవ్రంగా గాయపడింది.అదే సమయంలో అదే రోడ్డుపై వెళ్తున్న ఎంఏల్ఏ రోజా గాయపడిన సింధును చూశారు.వెంటనే తన కారులో పూతలపట్టు వరకు సిందును తీసుకెళ్ళారు.

 mla roja protect a lady

పూతలపట్టులోని ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు ఎంఏల్ఏ రోజా,.సకాలంలో స్పందించి ఆసుపత్రికి తీసుకురావడం వల్లే సిందు ప్రాణాలతో బయటపడిందని వైద్యులు చెప్పారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన సిందును సకాలంలో ఆసుపత్రిలో చేర్పించి ప్రాణాలను కాపాడిన ఎంఏల్ఏ రోజాకు సింధు కుటుంసభ్యులు దన్యవాదాలు తెలిపారు.సకాలంలో రోజా స్పందించిన కారణంగానే సింధు బతికిందని వారంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+