ఎమ్మెల్యే రోజా వర్సెస్ సీపీఐ నారాయణ .. కుక్కలు , కులాలు , పార్టీల పేరుతో బాగా ఘాటుగా మాటకు మాట
నగరి నియోజకవర్గం వైసీపీ ఎమ్మెల్యే రోజా, సీపీఐ నేత నారాయణ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఒక పండుగలాగా కొనసాగాలని, 15 రోజులపాటు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైయస్సార్ హౌసింగ్ స్కీమ్ ను ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో టిడిపి నేతలు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ పై తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో సీపీఐ నేత నారాయణ కూడా పేదలకు సీఎం జగన్ ఇస్తున్న ఇళ్ల స్థలాల విషయంలో మండిపడ్డారు.

సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేసేంత స్థలం కూడా పేదలకు ఇవ్వకపోవడం అన్యాయం : సీపీఐ నేత నారాయణ
సీఎం జగన్ ఇంట్లో కుక్కలు కట్టేసేంత స్థలం కూడా పేదలకు ఇవ్వకపోవడం దారుణమని సీపీఐ నేత నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు అంటే తనకు గౌరవం ఉందని వాటికి విశ్వాసం ఉందని నారాయణ చురకలంటించారు . తనను కులం పేరుతో దూషించడం పైన కూడా మండిపడిన నారాయణ తనకు కులం అంటగడుతున్న మంత్రి పెద్దిరెడ్డి వైయస్ కు సిపిఐ మద్దతు ఇచ్చినప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటూ ప్రశ్నించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అవినీతి బురద నుంచి పుట్టిందని, దానిని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం ఉందని సిపిఐ నారాయణ హితవు పలికారు .

చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా గా సీపీఐ ని మార్చారని నారాయణపై రోజా ఫైర్
సీపీఐ నారాయణ చేసిన వ్యాఖ్యలపై నగరి ఎమ్మెల్యే రోజా ఫైర్ అయ్యారు. సీపీఐ పార్టీకి ఆయన తలవంపులు తెస్తున్నారంటూ రోజా నారాయణ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కమ్యూనిస్టులు ధర్నా చేయకుండానే ముఖ్యమంత్రి ఇళ్ల పట్టాలు ఇస్తున్నారని పేర్కొన్న రోజా, ఇప్పటి వరకు నారాయణ అసలు ప్రజలకు ఏం చేశారని ప్రశ్నించారు. సిపిఐ అంటే కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా అని అందరికీ తెలుసు అని, కానీ దానిని నారాయణ చంద్రబాబు నాయుడు పార్టీ ఆఫ్ ఇండియా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

విశ్వాసపాత్రమైన కుక్కలే ఉంటే వైయస్ వివేకా హత్యకు గురయ్యే వారా? నారాయణ ఘాటు రిప్లై
ఇక నగిరి ఎమ్మెల్యే ఏపీఐఐసీ చైర్మన్ రోజా చేసిన వ్యాఖ్యలకు సిపిఐ నేత నారాయణ కూడా ఘాటుగానే రిప్లై ఇచ్చారు. విశ్వాసపాత్రమైన కుక్కలే ఉంటే వైయస్ వివేకానంద రెడ్డి హత్యకు గురయ్యే వారా అని నారాయణ రోజా ను ప్రశ్నించారు. చంద్రబాబును వ్యతిరేకించి వైయస్సార్ కు మద్దతు ఇచ్చినప్పుడు తన కులం ఏమైనా మారిందా అని నిలదీశారు. నగరి ఎమ్మెల్యే రోజా మాదిరిగా తాను పార్టీలు, కులాలు మారలేదని నారాయణ గట్టి కౌంటర్ ఇచ్చారు.
-
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
వంటగ్యాస్ కష్టాలకు చెక్, ప్రభుత్వం కీలక నిర్ణయం- సరఫరా ఇక నుంచి..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
జన్మ నక్షత్రం అశ్వని, భరణి, కృత్తిక ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
'అమరావతి' కోసం అసెంబ్లీ ప్రత్యేక భేటీ, జగన్ అనూహ్య నిర్ణయం..!! -
RCB పేరు మారుతుందా?.. అనన్య బిర్లా క్లారిటీ! -
విశాఖపట్నం-బెంగళూరు ప్రయాణికులకు గుడ్ న్యూస్- ఈ వీక్లీ రైళ్లు ఇక..! -
అన్ని రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమావేశం.. సంచలన నిర్ణయం దిశగా..!! -
బంగారం మళ్ళీ పెరిగింది: తులం ఈ రోజు ఎంత? కారణాలేంటి? -
టమాటో నువ్వుల పచ్చడి.. ఈజీగా ఇలా చేసుకోండి..!!












Click it and Unblock the Notifications