జగన్ పార్టీలోకి శేషారెడ్డి!: మరికొందరి మొగ్గు, చర్చలు

దాదాపు రెండు నెలల క్రితం కాంగ్రెసు పార్టీ విభజనకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, మంత్రులు సిడబ్ల్యూసి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అధిష్టానాన్ని డిమాండ్ చేస్తున్నారు. అధిష్టానం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. మరోవైపు సీమాంధ్రలో జోరుగా సమైక్య ఉద్యమాలు సాగుతున్నాయి.
కాంగ్రెసు నేతలు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకుంది. సీమాంధ్రలో జగన్ హవా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నల్లమిల్లి శేషా రెడ్డి జగన్ పార్టీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరో ముగ్గురు, నలుగురు ఎమ్మెల్యేలు కూడా జగన్ పార్టీ నాయకులతో చర్చిస్తున్నట్లుగా చెబుతున్నారు.
అయితే, కాంగ్రెసు పార్టీ తన విభజన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటే పునరాలోచించే అవకాశముంది. మరికొందరు సీమాంధ్ర కాంగ్రెసు నాయకులు జగన్‌తో వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని అంటున్నారు. కాంగ్రెసు పార్టీ తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే చాలామంది నేతలు ఆ పార్టీలోకి వెళ్లే అవకాశముంది. మాజీ మంత్రి గాదె వెంకట రెడ్డి సమైక్యవాది జగన్ విడుదల కావడం సంతోషకరమని చెప్పడం తెలిసిందే.












Click it and Unblock the Notifications