ఎమ్మెల్యే విడదల రజిని ఫోన్ సంభాషణ లీక్: హెచ్ఎంపై వేటు
గుంటూరు: జిల్లాలోని చిలకలూరిపేట ఎమ్మెల్యే విడదల రజిని చేసిన ఫోన్ కాల్‌ను రికార్డ్ చేసి ఆ డేటాను బయటపెట్టినందుకు ఓ ప్రధానోపాధ్యాయురాలు సస్పెండ్‌కు గురయ్యారు. ఎమ్మెల్యే రజిని తనకు ఫోన్ చేసి మాట్లాడిన సంభాషణలను ఇతరు వద్ద వినిపిపించారు ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మి.
ఈ విషయం ఎమ్మెల్యే రజిని వరకు చేరడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిపై వేటుపడింది. ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది.
చిలకలూరిపేట పట్టణంలోని శారదా హైస్కూల్ కమిటీ నియామకంపై ఏర్పడిన వివాదం ప్రధానోపాధ్యాయురాలి సస్పెన్షన్‌కు కారణమైనట్లు తెలుస్తోంది. ఆ వివాదంలో ఎమ్మెల్యే రజిని జోక్యం చేసుకుని ప్రధానోపాధ్యాయురాలికి ఫోన్ చేసి కమిటీని రద్దు చేయాలని ఆదేశించారు.

ఎమ్మెల్యే ఆదేశాలను హెచ్ఎం అదే విషయాన్ని కమిటీకి కూడా తెలియజేశారు. అంతేగాక, ఎమ్మెల్యే మాట్లాడిన సంభాషణను రికార్డు చేసి కమిటీకి వినిపించారు.
ఈ క్రమంలో ఫోన్ కాల్ రికార్డు చేసి ఆ సంభాషణను కమిటీకి వినిపంచడంపై ఎమ్మెల్యే రజినీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాల్ డేటా లీక్ చేయడంపై ఆమె విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే ఫిర్యాదు చేయడంతో విద్యాశాఖ అధికారులు కూడా వెంటనే స్పందించారు. సదరు ప్రధానోపాధ్యాయురాలు ధనలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.












Click it and Unblock the Notifications