'మోడీ, బాబు..మేడ్ ఫర్ ఈచ్ అదర్': జగన్‌పై దూళిపాళ్ల

అసెంబ్లీలో తెలంగాణ ముసాయిదా బిల్లుపై చర్చకు నిరసనగా శుక్రవారం ఎపిఎన్జీవోలు తలపెట్టిన బంద్‌లో టిడిపి సీమాంధ్ర నేతలు పాల్గొంటారని చెప్పారు. సమైక్యాంధ్ర కోసం పాటుపడుతున్న ఎపిఎన్జీవోలకు సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీమాంధ్ర టిడిపి నేతలందరూ బంద్‌లో పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు.
వైయస్ రాజశేఖర రెడ్డి తన అనుయాయుల కోసం జివోలు తెచ్చారని ఆరోపించారు. శ్రీధర్ బాబు శాఖ మార్పుతో ఒరిగేదేమీ లేదన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబులు ఇరు ప్రాంతాల్లో లబ్ధి పొందేందుకు శాఖ మార్పు నాటకాలు ఆడుతున్నారన్నారు. బిఏసిలో శ్రీధర్ బాబును సమర్థించిన కిరణ్ ఇప్పుడు శాఖ మార్చడం హాస్యాస్పదమన్నారు.
రాహుల్‌ను కలిసొచ్చాక దూకుడు: ఎర్రబెల్లి
తెలంగాణపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ది ఉంటే కిరణ్‌ను బర్తరఫ్ చేయాలని టిటిడిపి ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు వేరుగా డిమాండ్ చేశారు. రాష్ట్రపతి పంపిన ముఖ్యమైన బిల్లును కాంగ్రెస్ నవ్వులపాలు చేస్తోందని మండిపడ్డారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి, తెలంగాణ ఇస్తామని చెప్పి కేంద్రం నాటకాలాడుతోందన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలతో ఆటుకుంటున్నారన్నారు.
విభజనపై అసెంబ్లీలో కిరణ్ ఎలాంటి వ్యూహం చేసినా, ఎమ్మెల్యేలు నాటకాలు ఆడినా తాము పార్లమెంటులో బిల్లును పాస్ చేస్తామని ప్రధాని మన్మోహన్ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ నాటకాలాడుతోందని ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. రాహుల్‌ను కలిసొచ్చాకనే కిరణ్ దూకుడు పెంచారన్నారు. శ్రీధర్ శాఖ మార్చి టి ప్రజలపై అక్కసు వెళ్లగక్కారన్నారు. కాంగ్రెసు, తెరాసలను ప్రజలు నమ్మడం లేదన్నారు.
పెద్ద జోక్: జగన్‌పై దూళిపాళ్ల
అవినీతిపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుడు మైసూరా రెడ్డి చర్చకు పిలవడం పెద్ద జోక్ అని టిడిపి నేత దూళిపాళ్ల నరేంద్ర ఎద్దేవా చేశారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ లోటస్ పాండ్ అన్నారు. జనం సొమ్ము దోచుకున్నందుకే జగన్ జైలుకు వెళ్లాడన్నారు. జగన్ కోట్లు దోచుకున్నట్లు సిబిఐ తేల్చలేదా అని ప్రశ్నించారు. జగన్‌కు ఆస్తులు ప్రకటించే దమ్ము లేదా అన్నారు. వైయస్ విజయమ్మ పిటిషన్లో ప్రతి అంశానికి తాము వివరణ ఇచ్చామన్నారు.
-
today rashiphalalu: నేడు ముఖ్య గ్రహాల గోచారంతో వీరి పంట పండుతుంది.. మీరున్నారా? -
తమిళనాడు, కేరళ, బెంగాల్, అసోంలో గెలుపెవరిది ? సీఓటర్ తాజా సర్వే..! -
అల్లు అర్జున్.. ఇండియన్ స్క్రీన్ పై ఎప్పుడూ చూడని రోల్: గగుర్పాటు -
చెన్నై సూపర్ కింగ్స్ కు భారీ ఉపశమనం- పులి వచ్చింది -
ఓటీటీలోకి తెలుగు బోల్డ్ మూవీ.. అర్జున్ రెడ్డికి మించి.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్ -
'హ్యాపీ బర్త్ డే బావా'.. ఎన్టీఆర్ ఎమోషనల్ పోస్ట్.. బన్ని షాకింగ్ రిప్లై.. -
అమరావతికి కేంద్రం మరో భారీ గుడ్ న్యూస్, ఈ సారి ఏకంగా..!! -
74 రూపాయలకే 12 వేల కోట్ల ఆస్తి! అపర కుబేరుడి పతనం -
SPG గురించి ప్రపంచానికి తెలియని రహస్యాలు. -
AP Inter Results 2026: ఇంటర్ ఫలితాలు ఎప్పుడంటే ? బోర్డు క్లారిటీ..! -
కుప్పకూలిన ధరలు: సీజ్ ఫైర్ దెబ్బకు -
పెద్దిని ఎదుర్కొనడం అంటే సాహసమే












Click it and Unblock the Notifications