వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేసీఆర్-బాబులకు మోడీ షాక్: ఇక్కడ పక్కన పెట్టి అక్కడ, కేటీఆర్ కలిసి అడిగినా

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ప్రధాని నరేంద్ర మోడీ దేశంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లో ఒకటైన ఉత్తర ప్రదేశ్‌లోని బుందేల్‌ఖండ్‌కు తీపి కబురు అందించారు. ఈ ప్రాంతంలో రూ.20 వేల కోట్ల రక్షణ కారిడార్ నిర్మిస్తామని చెప్పారు.

Recommended Video

No-Trust Motion : Union Home Ministry Calls AP Officials

ఈ విషయంలో ప్రధాని మోడీ తెలుగు రాష్ట్రాల విజ్ఞప్తులను పక్కన పెట్టి బుందేల్‌ఖండ్‌కు భారీ ప్యాకేజీ ప్రకటించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిఫెన్స్ కారిడార్ విషయంలో తెలంగాణ, నవ్యాంధ్రప్రదేశ్ కోరికలను ప్రధాని మన్నించలేదంటున్నారు.

పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్: జగన్‌పై పార్టీలో అసంతృప్తి? మార్చి 21 డెడ్‌లైన్, రెండింట్లో ఏది?

భారీగా పెట్టుబడి, ఉద్యోగాలు

భారీగా పెట్టుబడి, ఉద్యోగాలు

బడ్జెట్‌లో రెండు రక్షణ కారిడార్‌లలో ఒకదానిని బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేస్తామని మోడీ బుధవారం చెప్పారు. యూపీలో ఏర్పాటు చేసిన ఇన్వెస్టర్ల సమ్మిట్-2018లో ఆయన ఈ విషయం చెప్పారు. రక్షణ కారిడార్ కారణంగా రాష్ట్రానికి రూ.20,000 కోట్లు రావడంతో పాటు 2.5 లక్షల మందికి ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారు.

పరిగణలోకి తీసుకోలేదు

పరిగణలోకి తీసుకోలేదు

రెండింట్లే ఒక రక్షణ కారిడార్ బుందేల్‌ఖండ్‌లో ఏర్పాటు చేస్తామని చెప్పినప్పటికీ.. తెలుగు రాష్ట్రాలు దీని కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఈ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదని అంటున్నారు.

కేటీఆర్ విజ్ఞప్తి ఇలా

కేటీఆర్ విజ్ఞప్తి ఇలా

తెలంగాణలో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు చేయాలని ఇటీవల రక్షణ శాఖ మంత్రిని కలిసి తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. హైదరాబాదులో రక్షణ రంగ సంస్థలు చాలా ఉన్నాయని, వాటికి అనుబంధంగా డిఫెన్స్ కారిడార్ ఇవ్వాలని కేటీఆర్ కోరారు.

కేంద్ర రక్షణ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర

కేంద్ర రక్షణ రంగ సంస్థలను ఏర్పాటు చేయాలని నవ్యాంధ్ర

మరోవైపు, కేంద్ర రక్షణ సంస్థలను నవ్యాంధ్రలో ఏర్పాటు చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కోరుతోంది. విభజనతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు రక్షణ కారిడార్ వంటి కేంద్ర సంస్థలతో కొంత ఊరట లభిస్తుందని ఏపీ భావించింది. కానీ తెలుగు రాష్ట్రాలను మన్నించలేదని అంటున్నారు.

English summary
Prime Minister Narendra Modi announced a Rs 20,000-crore defence industrial corridor in Bundelkhand for development of one of the most backward regions of Uttar Pradesh and said the Yogi government has pulled the state out of prevailing negativity.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X