Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

రుతువపనాల రాక, తొలకరి మొదలు - తీవ్ర తుఫానుగా బిపర్జాయ్..!!

ఎట్టకేలకు నైరుతి రుతుపవనాలు గురువారం కేరళలోకి ప్రవేశించాయి. కేరళ, దక్షిణ తమిళనాడుల్లో అనేక ప్రాంతాలు, దక్షిణ అరేబియా సముద్రంలో మిగిలిన ప్రాంతాల్లో రుతుపవనాలు విస్తరించాయి. ఈ నెల 14వ తేదీ తరువాత తొలుత రాయలసీమలో, ఆ తరువాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రుతుపవనాలు వచ్చేంత వరకు ఎండలు కొనసాగనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్జాయ్‌' గురువారం అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడనుంది.

విస్తరిస్తున్న రుతుపవనాలు:రుతుపవనాల ప్రవేశంతో తొలకరి మొదలైంది. పలు ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు గురువారం విస్తరించాయి. గడచిన 24 గంటల్లో కేరళలో విస్తారంగా వర్షాలు కురిశాయి. ఆ రాష్ట్రంలో ఎంపిక చేసిన 14 కేంద్రాల్లో రోజుకు 2.5 మి.మీ. కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. రానున్న రెండు రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, కేరళలో మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులో మరికొన్ని ప్రాంతాలు, కర్ణాటకలో పలు ప్రాంతాలు, బంగాళాఖాతంలో అనేక ప్రాంతాలు, ఈశాన్య భారతంలో కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించనున్నాయని పేర్కొంది. అతి తీవ్ర తుఫాన్‌ 'బిపర్జాయ్‌' ప్రభావంతో వారం రోజుల వరకు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది.

Monsoon advancing into other areas, Cyclonic storm Biparjoy is expected to intensify into a very severe in next 24 hours

14వ తేదీ తరువాతనే:తెలుగు రాష్ట్రాలో ఈ నెల 14వ తేదీ తరువాత రుతుపవనాలు విస్తరించనున్నాయి. ఈ నెల 14వ తేదీ తరువాత తొలుత రాయలసీమలో, ఆ తరువాత దక్షిణ కోస్తాలో రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనెల 17వ తేదీ తరువాత ఉత్తర కోస్తా వరకు రుతుపవనాలు విస్తరించనున్నాయని చెబుతున్నారు.

సాధారణంగా జూన్‌ 5న రాయలసీమ, 10న ఉత్తర కోస్తాకు రుతుపవనాలు రావల్సి ఉంది. కేరళకు ఆలస్యంగా ప్రవేశించటంతో..తెలుగు రాష్ట్రాల్లో మరో అయిదు రోజులు ఎండలు కొనసాగనున్నాయి. ఇదే సమయంలో రెండు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తున్నాయి. ఉదయం సమయంతో వడగాల్పులు..సాయంత్రం తరువాత పలు ప్రదేశాల్లో వర్షాలు కురిసాయి.

తీవ్ర తుఫానుగా బిపర్జాయ్:అరేబియా సముద్రంలో ఏర్పడిన 'బిపర్జాయ్‌' గురువారం అతి తీవ్ర తుఫానుగా మారింది. రానున్న 48 గంటల్లో ఇది మరింత బలపడుతుందని భావిస్తున్నారు. 'బిపర్జాయ్‌' చాలా వేగవంతంగా బలోపేతమవుతోందని గుర్తించారు. తుఫాను గాలుల తీవ్రత ప్రస్తుతం గంటకు 135 నుంచి 145 కిలోమీటర్లు ఉంది.

కర్ణాటక, గోవా, మహారాష్ట్ర తీరప్రాంతాలపై దీని ప్రభావం ఉంటుందని భావిస్తున్నారు. దీనివల్ల వచ్చే విపత్కర పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాము పూర్తిగా సిద్ధమయ్యామని గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించింది. తుఫాన్‌ పూర్తిగా బలహీనం కావడానికి మరో వారం పడుతుందని, ఆ తరువాతే రుతుపవనాల పురోగతి వేగంగా ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ నెల 14వ తేదీ తరువాత తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల విస్తరణతో వాతావరణం చల్లబడే అవకాశం ఉంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+