రుతుపవనాల ఆగమనం, తెలుగు రాష్ట్రాల్లో ఆ రోజే - వర్షాలపై బిగ్ అప్డేట్..!!

వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఈ రోజు కేరళను తాకనున్నాయి. ఇప్పటి వరకు ఎండలు.. ఉక్కపోతతో అల్లాడిన వారికి రిలీఫ్ దక్కనుంది. రుతుపవనాల రాకతో పలు రాష్ట్రాల్లో వర్షాలు కురవనున్నాయి. ఇప్పటికే కేరళలో తొలకరి మొదలైంది. కాగా, తెలుగు రాష్ట్రాల్లో రుతుపవనాల ప్రవేశం పైన వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఇదే సమయంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.

రుతుపవనాలు ఈ రోజు కేరళలోకి ప్రవేశించనున్నాయి. గత నెల 26వ తేదీనే వస్తాయని అంచనా వేసినా.. వాతావరణంలో మార్పులతో ఈ రోజు ప్రవేశిస్తున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. సాధారణంగా కేరళలో రుతుపవనాలు ప్రవేశించిన తర్వాత, అవి ఆంధ్రప్రదేశ్‌కు చేరుకోవడానికి మూడు నుంచి నాలుగు రోజుల సమయం పడుతుందని ఐఎండి అంచనా వేస్తోంది. ఒకవేళ ఏవైనా ప్రతికూల పరిస్థితుల వల్ల ఆలస్యం జరిగితే, రాష్ట్రానికి చేరుకోవడానికి గరిష్టంగా ఏడు రోజుల వరకు కూడా సమయం పట్టవచ్చని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం రాబోయే నాలుగు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లోకి రుతుపవనాలు ప్రవేశించడానికి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, కేరళలో ప్రవేశించిన తర్వాత దీనిపై మరింత స్పష్టత వస్తుందని చెబుతున్నారు. కాగా, అదే సమయంలో తెలంగాణలోకి రుతుపవనాలు ప్రవేశించనున్నాయి.

కేబినెట్ భేటీ: వీరికి కొత్త పెన్షన్లు, తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం..!!
కేబినెట్ భేటీ: వీరికి కొత్త పెన్షన్లు, తల్లికి వందనం నిధుల జమ ముహూర్తం..!!
monsoon-is-likely-to-advance-into-kerala-on-thursday-marking-the-onset-of-indias-four-month-rainy

తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పై కీలక అప్డేట్

గురువారం నాడు రాష్ట్రంలోని 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 79 మండలాల్లో సాధారణ వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. విజయనగరం, పార్వతీపురం-మన్యం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పోలవరం ప్రాంతాలు ఈ వడగాల్పుల బారిన పడే అవకాశం ఉంది. శుక్రవారం నాడు మరికొన్ని మండలాల్లో తీవ్ర వడగాల్పుల పరిస్థితులు మరింత విస్తరించే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అదే విధంగా ఈసారి వర్షపాతం రాష్ట్రవ్యాప్తంగా సమానంగా ఉండకపోవచ్చు. రాయలసీమ ప్రాంతంలో సాధారణం లేదా సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. కానీ కోస్తా ఆంధ్ర, ఉత్తర ఆంధ్ర ప్రాంతాలలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+