ఏపీలో కరోనా విజృంభణ.. లక్షకుపైగా పాజిటివ్ కేసులు.. కొత్తగా ఎన్నంటే..?
ఆంధ్రప్రదేశ్ కరోనా విలయతాండవం చేస్తుంది. వైరస్ బారిన పడిన సంఖ్య అంతకంతకు పెరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 46,143 శాంపిల్స్ పరిక్షించగా .. కొత్తగా 13,618 మందికి పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా యాక్టివ్ కేసులు సంఖ్య1,06,318కి పెరిగిందని వైద్యారోగ్య శాఖ తెలిపింది. కరోనాతో పోరాడుతూ ఇవాళ 9 మంది మరణించారు.
రాష్ట్రం వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 22,22,573 మంది కరోనా సోకగా.. వారిలో 21,01685 మంది కోలుకున్నారు. 14,570 మంది వైరస్ తో పొరాడుతూ మృతి చెందారు. గడిచిన 24 గంటల్లో తూర్పుగోదావరి, నెల్లూరు, విశాఖ పట్నంలలో ఇద్దరు, చిత్తూరు, శ్రీకాకుళం, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. తాజా 8,687 మంది కరోనా బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు సంఖ్య 1,06,318 కిచేరింది..

ఏపీలో అత్యధికంగా విశాఖ పట్నం జిల్లాలో 1791 కొత్త కేసులు నమోదయ్యాయి. అనంతపురం 1650, గుంటూరు 1464, కర్నూరు 1409, ప్రకాశం 1295, నెల్లూరు 1007 మందికి పాజిటివ్ గా నిర్థారణ అయింది. అటు తూర్పు గోదావరి 961, కడప 907, కృష్ణా 803, పశ్చిమ గోదావరి 728, శ్రీకాకుళం 644, చిత్తూరు 493, విజయనగరం 466 కరోనా కేసులు నమోదయ్యాయి.
అయితే గత కొన్ని రోజులుగా రోజూ 10 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. నిన్నటితో పోలిస్తే కాస్త కేసులు తగ్గాయి. అదే సమయంలో కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య కూడా పెరిగింది. కరోనా కట్టడికి ఏపీలో నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. దేవాలయాల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. కరోనా పట్ల అప్రమత్తంగా ఉంటూ జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
#COVIDUpdates: 26/01/2022, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) January 26, 2022
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 22,19,678 పాజిటివ్ కేసు లకు గాను
*20,98,790 మంది డిశ్చార్జ్ కాగా
*14,570 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 1,06,318#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/oV6ha2qL9a












Click it and Unblock the Notifications