మీడియా అంతా మీదేగా: 'ఈనాడు' స్టోరీతో చంద్రబాబుకు పవన్ దిమ్మతిరిగే కౌంటర్

అమరావతి: శ్రీకాకుళం జిల్లాను కుదిపేసిన టిట్లీ తుఫాను పైన తాము కేంద్రానికి లేఖ రాశామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం చెప్పారు. ఈ మేరకు ఆయన తన సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ ద్వారా తెలిపారు. టిట్లీ తుఫానుపై పవన్ కేంద్రానికి లేఖ రాయలేదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

పవన్‌ కేంద్రాన్ని ఎందుకు నిలదీయలేదో చెప్పాల్సిన అవసరం ఉందని, ప్రతిపక్షాలుగా ఉండి ప్రజలకు కష్టం కలిగినప్పుడు బాధ్యత ఉండదా అని, ప్రజల అండ కావాలనుకున్నప్పుడు వారికి ఏమీ చేయకుండా వారి సానుభూతి పొందే హక్కు ఎక్కడ ఉంటుందని చంద్రబాబు శ్రీకాకుళం జిల్లా పలాసలో సోమవారం విమర్శించారు. దీనికి జనసేనాని కౌంటర్ ఇచ్చారు.

ఈనాడు పోస్టుతో టీడీపీకి కౌంటర్

ఈ మేరకు టిట్లీ తుఫాను నష్టం పైన ప్రధాని నరేంద్ర మోడీకి రాసిన లేఖను ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. టిట్లీ తుఫానుపై కేంద్రానికి లేఖ రాయడం, అవినీతిపై సవాల్ తదితర పలు అంశాలపై పవన్ కళ్యాణ్ వరుస ట్వీట్లు చేశారు. టీడీపీ అవినీతిపై సవాల్ చేయడంతో పాటు ఈనాడులో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేసి అధికార పార్టీ నేతలకు షాకిచ్చారు. టీడీపీ కరప్షన్‌కు ఇది నిదర్శనం అంటూ ఆధారం.. ఈనాడు అంటూ 'మట్టైనా.. మనదేనోచ్' అని ఆ పత్రికలో వచ్చిన కథనాన్ని పోస్ట్ చేశారు.

ఇదిగో ఆధారం

సోమవారం నాడు చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో తాను టిట్లీ తుఫాను గురించి కేంద్ర ప్రభుత్వానికి కనీసం లేఖ రాయలేదని ఆరోపించారని, దానికి ఇది నిదర్శనమని రెండు పేజీల లేఖను పవన్ పోస్టు చేశారు. టిట్లీ విషయమై తాను ప్రధానికి లేఖ రాశానని చెప్పడానికి ఇదే ఆధారమని అందులో పేర్కొన్నారు.

దీంతో మీరేం చేయలేరా?

మరో ట్వీట్‌లో చంద్రబాబు, నారా లోకేష్‌లు అవినీతిపై పదేపదే ఆధారాలు అడుగుతున్నారని, అందుకే తాను ఇక్కడ వంతాడలో అండ్రు మైనింగ్ పైన జేసీ రిపోర్టును పోస్ట్ చేస్తున్నానని, దీనిని చూసి విచారణకు ఆదేశించాలని, నిందితులను శిక్షించాలని పవన్ దిమ్మతిరిగే షాకిచ్చారు. దీంతో మీరేం చేయలేరా అని నిలదీశారు.

మీడియా మొత్తం మీదేగా.. అందుకే

మీడియా మొత్తం మీదేగా.. అందుకే

ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన సమస్య ఏమంటే దాదాపు ఎక్కువ మీడియా మీ చేతుల్లో ఉందని చంద్రబాబును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ అన్నారు. కాబట్టి జనసేన పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లలా వద్దాలా అనేది మీరు కంట్రోల్ చేస్తున్నారని అభిప్రాయపడ్డారు. కానీ వార్తను బయటకు రాకుండా చేస్తారని, అందుకే మీరు ప్రజల ముందు మాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+