ఆ తల్లిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు: దిక్కులు పిక్కటిల్లేలా రోదన..

కుక్కల దాడిలో గాయపడిన కొడుకును చూసి విలవిల్లాడింది.

గుంటూరు: కూలీకి వెళ్లిన తల్లికి.. ఇంటికొచ్చేసరికి పిడుగు లాంటి వార్త చెవిన పడింది. కుక్కల దాడిలో గాయపడిన కొడుకును చూసి విలవిల్లాడింది. కొడుకు మృతదేహం రక్తమోడుతున్న దృశ్యం చూసి గుండెలవిసేలా ఏడ్చింది. ఈ హృదయ విదారక సంఘటన గుంటూరు జిల్లా అడవి తక్కెళ్ళపాడులో చోటు చేసుకుంది.

పని నుంచి రాగానే.. మీ అబ్బాయిని కుక్కలు కరిచాయన్న విషయం తెలిసి.. ఆ తల్లి ఉరుకులు పరుగులతో ఆసుపత్రికి చేరింది. కళ్లెదుట కన్న కొడుకు రక్తపు ముద్దలా పడి ఉండటం చూసి తట్టుకోలేకపోయింది. దిక్కులు పిక్కటిల్లేలా రోదించింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న బిడ్డంగా.. అపురూపంగా పెంచుకున్న బిడ్డ.. ఇలా అర్థాంతరంగా దుర్మరణం చెందడం ఆమెను తీవ్రంగా కలచివేసింది.

mother cries after seeing son's dead body in guntur hospital

ఆ తల్లి గుండెలవిసేలా ఏడుస్తుంటే చుట్టున్నవారంతా నిశ్చేష్టుల్లా నిలబడిపోయారు. ఆసుపత్రిలో ఇలాంటి దృశ్యాలు సాధారణమే అయినప్పటికీ.. ఆ తల్లి రోదన మాత్రం ప్రతీ ఒక్కరిని కలచివేసింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+