Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

కన్నబిడ్డపై తల్లి క్రూరత్వం : చేతులు, కాళ్ళు విరిచేసి, రక్తం కారేలా కొడుతూ నిత్య నరకం, ఆ వీడియోలు భయానకం !!

అమ్మ అన్నపదానికి అర్థం మరచిన ఓ తల్లి బిడ్డను అత్యంత దారుణంగా హింసించింది. అమ్మతనానికి మాయని మచ్చ తెచ్చింది. అభం శుభం తెలియని నోరు లేని బిడ్డకు నరకం చూపించింది. రక్తం వచ్చేలా కొడుతూ చెప్పనలవి కాని విధంగా హింసించింది. కడుపులో పెట్టుకుని కాపాడుకోవలసిన కన్న తల్లి కర్కశంగా ప్రవర్తించడంతో, ఏమీ అర్ధం కాని, బాధను తట్టుకోలేని బిడ్డ రోదన కూడా ఆ తల్లి మనసును కరిగించలేకపోయింది.

 చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన

చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన

చిత్తూరు జిల్లాలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. నవమాసాలు మోసి కన్న కొడుకును కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తల్లే కర్కశంగా ప్రవర్తించింది. భర్తను వదిలి పెట్టి, ప్రియుడి మోజులో పడిన ఓ తల్లి కన్నబిడ్డను చిత్రహింసలకు గురిచేసింది. అక్రమ సంబంధాన్ని గుట్టుగా కొనసాగిస్తున్న ఆ కర్కశ తల్లి గుట్టు భర్త రట్టు చేయడంతో భర్తపై ఉన్న కోపాన్ని, కక్షను అభం శుభం తెలియని చిన్నారిపై చూపించింది. అంతేకాదు వాటన్నింటినీ వీడియో చిత్రీకరణ చేసుకుంది ఆ శాడిస్టు తల్లి. నిత్యం పిల్లవాడికి నరకం చూపిస్తూ ఆ వీడియోలను భర్తకు, ప్రియుడికి షేర్ చేసింది.

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణం

అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళ దారుణం

చిత్తూరు జిల్లా అనిపల్లికి చెందిన తులసి అనే మహిళకు తమిళనాడులోని విల్లుపురం జిల్లా సత్యమంగళం మండలం మిట్టూరు గ్రామానికి చెందిన వడివేలన్ కు ఆరేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి నాలుగు సంవత్సరాల గోకుల్, రెండు సంవత్సరాల ప్రదీప్ ఇద్దరు సంతానం. వ్యవసాయ పనులు చేసుకునే వడివేలన్ పొలంలోనే అధిక సమయం గడుపుతూ ఉండేవాడు. ఇక ఈ క్రమంలో తులసి మొబైల్ ఫోన్ ద్వారా చాటింగ్ చేస్తూ పిల్లలను కూడా పట్టించుకోనంత బిజీగా ఉండేది. ఇక ఈ క్రమంలో ఒక వ్యక్తితో పరిచయం అయిన తులసికి, ఆ పరిచయం కాస్తా అక్రమ సంబంధంగా మారింది.

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడని పిల్లలను టార్చర్ చేసిన మహిళ

అక్రమ సంబంధాన్ని వద్దన్నాడని పిల్లలను టార్చర్ చేసిన మహిళ

ఇక భర్త పొలానికి వెళితే ప్రియుడితో తులసి తన అక్రమ సంబంధాన్ని కొనసాగించేది. ఒకరోజు ప్రియుడితో ఏకాంతంగా ఉన్న తులసిని చూసిన భర్త వడివేలన్ ఆమెను మందలించాడు. ఈ క్రమంలో ఆమెలో మార్పు రాకపోగా మరింత శాడిస్ట్ గా మారిపోయింది. భర్త మందలిస్తే పిల్లలను చిత్రహింసలకు గురి చేయడం అలవాటుగా మారింది. అమ్మ కొట్టిందని నోటితో చెప్పలేని చిన్నారుల బాధ తెలిసేలా ఆమె చూపించిన నరకాన్ని వీడియో తీసి భర్తకు పంపించేది.నువ్వు నన్ను బాధ పెడితే ణీ పిల్లలకు నరకం చూపిస్తానని చెప్పకనే చెప్పేది.

విడాకులు కోరిన మహిళ .. భర్తపై కోపంతో రెండేళ్ళ కొడుకుకు నరకం

విడాకులు కోరిన మహిళ .. భర్తపై కోపంతో రెండేళ్ళ కొడుకుకు నరకం

ఒకరోజు పెద్ద కొడుకు గోకుల్ ను చిత్రహింసలకు గురి చేయగా, నోటి నుండి రక్తం కారడంతో తండ్రి వడివేలన్ ఆసుపత్రికి తీసుకు వెళ్లి చికిత్స చేయించాడు. ఇక భర్తతో ఉండడం ఇష్టం లేని తులసి అక్కడినుండి పరారై చిత్తూరు జిల్లా అనిపల్లి లోని తండ్రి ఇంటికి చేరుకుంది. భర్తతో కాపురం ఇష్టం లేదని విడాకులు కావాలని భర్తకు విడాకుల నోటీసులు పంపించింది. తులసి టార్చర్ భరించలేని భర్త తమిళనాడు పోలీసులను ఆశ్రయించాడు. ఈ క్రమంలో భర్తపై మరింత కోపాన్ని పెంచుకున్న తులసి చిన్న కుమారుడు ప్రదీప్ కు చుక్కలు చూపించింది . రెండేళ్ల వయసున్న ప్రదీప్ ను ఆపకుండా కొడుతూ టార్చర్ చేసింది. పసివాడు విలవిలలాడుతున్నా , రక్తం కారుతున్నా, పెదాలు పగిలి పిల్లవాడు అల్లాడుతున్నా పట్టించుకోని ఆ తల్లి తన రాక్షసత్వాన్ని ప్రదర్శించింది.

వీడియోలు తీసి తండ్రికి పంపిస్తున్న మహిళ .. 250కి పైగా వీడియోలు

వీడియోలు తీసి తండ్రికి పంపిస్తున్న మహిళ .. 250కి పైగా వీడియోలు

ఆ వీడియోలు తండ్రికి పంపించటంతో ఏం చెయ్యాలో పాలుపోని ఆ తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. తన బిడ్డను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. ఇక ఆ తల్లి కుమారుని హింసిస్తున్న 250కి పైగా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ఆ వీడియోను చూసిన ప్రతి ఒక్కరి ఒళ్ళు గగుర్పొడిచింది. తల్లి కాదు కసాయి అన్నట్టు ఉన్న ఆ వీడియోలు పిల్లవాడి పట్ల జాలిని, తల్లిపట్ల ఆగ్రహాన్ని కలిగించాయి. శాడిస్ట్ తల్లిని అలాగే హింసించాలని పలువురు నెటిజన్లు నిప్పులు చెరుగుతున్నారు.

తల్లి పైశాచికంపై విచారణకు ఆదేశించిన తమిళనాడు సీఎం స్టాలిన్


ఇలాంటి తల్లులు కూడా ప్రపంచంలో ఉంటారా అని షాక్ అయ్యేలా ఉన్న ఆ వీడియోల వ్యవహారంపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సమగ్ర విచారణకు ఆదేశించారు. తులసి ఆచూకీ కోసం చిత్తూరు జిల్లాలో గాలింపు చర్యలు చేపట్టడానికి మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. తులసిని అరెస్ట్ చేసిన పోలీసులు, కన్న తల్లి చేతిలో చిత్రహింసలకు గురై నరకం చూసిన ప్రదీప్ ను వైద్యం నిమిత్తం ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ప్రదీప్ పరిస్థితి విషమంగా ఉంది. మ్మతనానికి మచ్చ తెచ్చిన, తులసి అనే పవిత్రమైన పేరు పెట్టుకున్న ఈ కసాయి తల్లిని కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

Recommended Video

    మంత్రి మల్లారెడ్డి అక్రమ ఆస్తులకు సంబంధించిన ఆధారాలను బహిర్గతం చేసిన రేవంత్ రెడ్డి
     అమానవీయంగా ప్రవర్తించిన తల్లి తీరుతో అందరూ షాక్

    అమానవీయంగా ప్రవర్తించిన తల్లి తీరుతో అందరూ షాక్

    సోషల్ మీడియాలో తులసి చర్యలను తిట్టిపోస్తున్నారు. ఇంత అమానవీయంగా ప్రవర్తించిన తల్లి ఈ భూమి మీద ఈమె తప్ప మరెవరూ ఉండదంటూ నిప్పులు చెరుగుతున్నారు. ఇలాంటి దారుణమైన ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు. శాడిస్ట్ తల్లి బారి నుండి బిడ్డలను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పిల్లలకు చిన్న దెబ్బ తగిలితేనే విలవిలలాడే తల్లులు ఉంటారు . కానీ ఇలా బిడ్డలను రోజుకో రకంగా చిత్రహింసలు పెట్టే తల్లులు కూడా ఉన్నారని ఈ ఘటనతో తెలుస్తుంది .

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+