వైఎస్ భారతిపై సినిమా: పోస్టర్ విడుదల చేసి ఆర్జీవీ సంచలనం!!
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సెన్సేషనల్ సినిమాకు సిద్ధమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతుంటే రాంగోపాల్ వర్మ తన సినిమాతో పొలిటికల్ హీట్ ను మరింత పెంచనున్నారు. ఎవరూ ఊహించని విధంగా రాంగోపాల్ వర్మ ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి పైన సినిమా చేయనున్నట్లు సంచలన ప్రకటన చేశారు.
తాను తీయబోతున్న సినిమా పోస్టర్ ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. రాంగోపాల్ వర్మ తాజా పోస్టుతో ఏపీ రాజకీయ వర్గాల్లో దుమారం రేగింది. అహంకారానికి ఆలోచనకూ మధ్య జరిగిన యుద్ధం ఇతివృత్తంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్ ను విడుదల చేసిన రాంగోపాల్ వర్మ సినిమా పేరును "వ్యూహం" గా ఖరారు చేశారు.

ఇందులో వైయస్ భారతి పాత్రను మానస రాధాకృష్ణన్ , వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రను అజ్మల్ పోషించనున్నారు. ఇక ఈ సినిమా గురించి అంతకు ముందు ప్రకటన చేసిన రాంగోపాల్ వర్మ అతి త్వరలో వ్యూహం రాజకీయ సినిమా తీయబోతున్నానని పేర్కొన్నారు. అది బయోపిక్ కాదు, బయోపిక్ కన్నా లోతైన రియల్ పిక్ అంటూ వ్యాఖ్యలు చేశారు.
Y S Jagan and Y S Bharathi having a word about YSR in VYOOHAM pic.twitter.com/ZBEHTolXLT
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2023
బయోపిక్ లో అబద్ధాలు ఉండొచ్చు కానీ రియల్ పిక్ లో నూటికి నూరుపాళ్లు నిజాలే ఉంటాయంటూ రాంగోపాల్ వర్మ ఇటీవలే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటికే మహేష్ వీ రాఘవ దర్శకత్వంలో జగన్ బయోపిక్ సిద్ధమవుతుండగా, రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాతో ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చంద్రబాబుకు సంబంధించిన మరొక కోణాన్ని రాంగోపాల్ వర్మ ఆవిష్కరించనున్నారు.
Y S Bharathi character in VYOOHAM played by Manasa Radhakrishnan https://t.co/1kLGKhEVbh pic.twitter.com/vPIuAfo7pg
— Ram Gopal Varma (@RGVzoomin) June 1, 2023
ఈ చిత్రంతో చంద్రబాబును గట్టిగా టార్గెట్ చేయాలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఈ చిత్ర నిర్మాణం కోసం జగన్ తో సన్నిహితంగా ఉంటున్న రాంగోపాల్ వర్మ ఈ సినిమా పనులు చకచకా చేస్తున్నారని సమాచారం. ఈ చిత్రాన్ని రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం ఏపీ రాజకీయాలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి.
-
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్.. -
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
అమెరికాకు ఎదురుదెబ్బ? యుద్ధక్షేత్రం నుంచి వైదొలిగిన ఫోర్డ్.. కారణం ఏంటి? -
రైతు రుణమాఫీ లేదు.. తేల్చి చెప్పిన నిర్మలమ్మ! -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !!












Click it and Unblock the Notifications